గజల్

గజల్

రథీఫ్ ; విన్యాసాలు

కాఫియా : చూపునవే, మరుపునవే, చెందినవే,పుట్టినవే, చేరినవే, ఎండినవే

తిశ్రగతి…
6/6/6/6

కొత్తకొత్త వింతలన్ని చూపునవే విన్యాసాలు/
అలసటంతా చిటికెలోన మరపునవే విన్యాసాలు//

ఇంద్రజాల మాయలన్నీ కనికట్టుల ఆటలాయె/
బతుకుపోరు బాటలోకి చెందినవే విన్యాసాలు//

ప్రమాదపు అంచులతో సన్ననైనా తీగలాయె/
బాధలల్లో కన్నీళ్లకు పుట్టినవే విన్యాసాలు//

మసిబారిన పాలబుగ్గ వేచినాది ఆకలితో/
దైన్యస్థితి శిఖరాన్ని చేరినవే విన్యాసాలు//

చేయిచాచి అడగలేని వెర్రిమొర్రి గుండెలాయె/
కర్రలాంటి మోడులలో ఎండినవే విన్యాసాలు//

– కవనవల్లి

Related Posts