గమ్యం బాట
నీడలా నిస్తేజం
గోడలా కల్లోలం
కలలమేడను కూల్చేస్తుంటే
ఊరుకోవాలా
లోతుల్లోకి వెళ్ళి
మాటేసిన నిరాశను
పెళ్ళగించి
మనసు మందిరాన్ని సుసంపన్నం చేయాలి
నిన్ను కలవరపెట్టే నిన్న,రేపుల కన్నా
వర్తమానం వెలుగులను ఆస్వాదిస్తే
నీకో లక్ష్యాన్ని ఆపాదించుకోగలుగుతావు
గమ్యం బాటను అందంగా అలంకరిస్తావు
– సి.యస్.రాంబాబు