గమ్యం లేని జీవితం

గమ్యం లేని జీవితం

గమ్యం లేని జీవితం

 

రాములు, వైజయంతి ఒక సాధారణ తాపీ మేస్త్రి , కూలీ పని చేస్తూ ఉంటారు. వాళ్లకి ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి.అమ్మాయికి (ఇందు) పెళ్లి కుదిరింది. ఆరు నెలల తర్వాత పెళ్లి. అబ్బాయి (రాజేష్) పాలిటెక్నిక్ రాసి మెకానిక్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు.రాజేష్ కొన్ని రోజుల తర్వాత

“నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. అక్కడ టీచర్స్ చెప్పేది నాకు అర్థం కావట్లేదు” అని ఇంట్లో చెప్పాడు.
“అలాగైతే ట్యూషన్ పెట్టించుకో డబ్బులు ఇస్తాను” అని చెప్పాడు రాములు.

అయినా సరే రాజేష్ కి ఇష్టం లేకపోయినా కాలేజీకి వెళ్లేవాడు. కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది.

లాక్ డౌన్ తర్వాత ఇంట్లో ఎందుకు ఉండడం అని అనుకొని పార్ట్ టైం జాబ్ చూసుకున్నాడు రాజేష్.
అలా కొన్ని నెలల తర్వాత కాలేజ్ రీ ఓపెనింగ్ అయ్యింది.

రాజేష్ కాలేజ్ రీ ఓపెనింగ్ అయ్యింది. నువ్వు కాలేజ్ కి  ఎప్పుడు వెళ్తున్నావ్?” అని అడిగాడు రాములు.
“నేను వెళ్ళను నాన్న. నాకు ఆ కాలేజ్ అంటే ఇష్టం లేదు. నేను ఈ పార్ట్ టైం జాబ్ చేసుకునే ఉంటాను” అని చెప్పేసాడు రాజేష్.

“నువ్వు చదువుకపోతే నిన్ను ఎవరు ఏం అన్నారు. మమ్మల్ని అంటారు నిన్ను ఎందుకు చదివించలేదు” అని చెప్పాడు రాములు.

అలా పార్ట్ టైం జాబ్ చేస్తున్న రాజేష్ కి తన ఫ్రెండ్ సంతోష్ దగ్గర కెమెరా చూసి కెమెరా మాన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు రాజేష్.

ఈ విషయం ఇంట్లో చెప్తే రాములు, వైజయంతి అసలు ఒప్పుకోలేదు.“మన స్థాయిని బట్టి మనము బతకాలి. నేను ఏం పని చేస్తున్నానో నీకు తెలుసు. నీ భవిష్యత్తు అసలు బాగుండదు” అని రాజేష్ కి బుద్ధి చెప్పాడు రాములు.

ఇలా ఎన్నిసార్లు చెప్పిన వినకుండా హాలిడే ఉన్న ప్రతిసారి షూటింగ్స్ జరిగే ప్రదేశాలకి వెళ్లేవాడు రాజేష్.

అలా కొన్నాళ్ళు తర్వాత పార్ట్ టైం జాబ్ మానేసి సినీ పరిశ్రమంలో పనిచేయాలనుకున్నాడు. తన కాబోయే బావగారు చుట్టాలు షూటింగ్లో పనిచేస్తున్నారు.

రాజేష్ వాళ్ళ నెంబర్ తీసుకుని ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేసి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది. నేను అందులో పని చేస్తాను అని చెప్పేవాడు.

సరే మరి బాగా తెలిసిన వాడు కదా అని వాళ్ళు కూడా షూటింగ్లో పనిచేయడానికి ఒప్పుకున్నారు.
రాజేష్ ప్రతి రోజు షూటింగ్ కి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఏదో గొడవ జరగడం వల్ల షూటింగ్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.

రాజేష్ ప్రస్తుత ఇప్పుడు ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉంటూ , తల్లితండ్రులు రాజేష్ ని చూసి ప్రతిసారి రేపు వాడి భవిష్యత్తు ఏంటో ఆలోచించకుండా ఇంట్లోనే ఉంటే ఏమొస్తుందో అర్థమయ్యేలా చెప్పిన వినడం లేదు.

ఆరు నెలల తర్వాత ఎందుకు పెళ్లి చేసి పంపించారు. ప్రజల దగ్గర ఏ మాట పడకుండా అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిపించి ఇందుని అత్తారింటికి పంపించారు.

రాజేష్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రాములు, వైజయంతి పనిచేస్తున్నారు.నాకు డబ్బులు ఇవ్వండి నేను కెమెరా కొనుక్కొని దానికి సంబంధించిన కోర్సు చేస్తాను” అని చెప్పి బాధ పెట్టేవాడు రాజేష్.

“ఇప్పుడే మీ అక్క పెళ్లి చేశాను. నీకు డబ్బులు ఎలా ఇస్తారు? నా దగ్గర డబ్బులు ఏమీ లేవు?” అని తెగేసి చెప్పేశాడు రాములు.

పెళ్లికి చేసిన అప్పులను తీరుస్తూ జీవనం గడుపుతున్నారు వైజయంతి , రాములు.కొడుకు జీవితంలో స్థిరపడితే అదే మాకు ఆనందం అని అనుకుంటూ బతుకుతున్నారు.

రాజేష్ మాత్రం ఏ గమ్యం లేక ఏ ఉద్యోగం చేయలేకఇలాంటి బాధ్యతలు లేని వాళ్ళు ఏమనాలో అర్థం కావట్లేదు. రాజేష్ గమ్యం లేని జీవితం గడుపుతూ ఉన్నాడు.

పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత కూడా ఎగరకపోతే ఎలా? ఎన్ని రోజులు తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల నుంచి కాపాడుతారు.

 

-మాధవి కాళ్ల

రంగుల ప్రపంచం Previous post  రంగుల ప్రపంచం
మనస్సు చదివిన వేదం Next post మనస్సు చదివిన వేదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close