గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం

భారత రాజ్యాంగం నిత్య స్ఫూర్తితో వెలగాలని
రూపొందించుకున్నాము

ప్రజలదే పాత్ర అని
ప్రభుత్వం ముఖ్యమని
ఓటు హక్కులని
సమానత్వం సత్యమని
ప్రజాస్వామ్యమే దేశమని
సమగ్రతనే శాసనమని
జాతీయతనే జెండా అని
అవకాశాలు అందరికని
న్యాయం సమానమని
పౌరులే ప్రధమమని
పాలకులే నాయకులని
ఆశయాలే ఆచరణని
భద్రతే భరోసా అని
బానిసత్వంతో సమరమని
బాధ్యతే పరమావధని
ప్రయోజనమే ప్రాతిపదికని
విశ్వసనీయతే విజేత అని
ప్రలోభాలకు తావేలేదని
ఎన్నికలే మూలమని
ఓటుహక్కు ఆయుధమని
చైతన్యమే సాధనమని
అభివృద్ధి ప్రణాళికలని
దేశరక్షనే కర్తవ్యమని
ప్రజలే సారధులని
బంధనాలను విముక్తి
చేసుకుని రాజ్యాంగాన్ని
అమలుపరచుకున్నా

భారతదేశ ఖ్యాతి కోసం సత్యమేవ జయతే అనే నినాదం అసత్యం కాకుండా అందరికీ రాజ్యాంగం సమానమేనని
రాజ్యాంగ బద్ధులై పరిపాలన జరిగిన రోజు
సామాన్యునికి అవలోకనమైన రోజు
జనభారతావనికి అదృష్టం
అందివచ్చినట్లే…..

– జి జయ

స్వేచ్ఛ స్వాతంత్ర్యం Previous post స్వేచ్ఛ స్వాతంత్ర్యం
స్వేచ్ఛ Next post స్వేచ్ఛ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *