గాంధీజీ – లాల్ బహద్దూర్ శాస్త్రి
గాంధీ సత్యం,అహింస అనే సాధనాలతో అందరినీ ప్రభావితులను చేసి అందరినీ ఒక్క తాటిపై నడిపించిన ఖ్యాతి గాంధీ కి దక్కింది. ఆయన సారధ్యం లో స్వాతంత్య్రం మనకు దక్కింది. అంతకు ముందు ఎందరో ప్రాణ త్యాగం చేసిన వీరులు ఎందరో. అల్లూరి,భగత్ సింగ్,బోస్ మొదలైన ఎందరో వీరులు తమ ప్రాణాలను అర్పించారు.
కొల్లాయి గట్టితేనేమి మన గాంధీ అని పాటలు కూడా వచ్చాయి. కానీ లాల్ బహదూర్ అలా కాదు .శ్రీ రాముడు లా ఆయన నడతే మనకు ఆచరణీయం.అందుకే లాల్ బహదూర్ గురించే వ్రాద్దామనుకుంటాను. గాంధీని అందరం ఆకాశానికెత్తుతాం.లాల్ బహదూర్ ని భారత జాతి ఎందుకో వెనక వేసింది.
లాల్ బహదూర్ చిన్నప్పటి నుండి పేదరికంలోనే మగ్గిపోయాడు.చిన్నతనంలోనే తండ్రి పోవటం,తాతగారింట్లో పెరగటం,గాంధీజీ,తిలక్ వారణాసి వచ్చినపుడు వారి ప్రసంగానికి ప్రభావితుడై స్వాతంత్య్ర యోధుడైనాడు. నిస్వార్థ ప్రజా సేవకుడుగా ,భారత దేశానికి రెండవ ప్రధానిగా జై జవాన్ జై కిసాన్ అని దేశాన్ని నడిపించిన ఘనత శాస్త్రీజీ దే.
లీలావతిని వివాహమాడారు, ఆమె కూడా గృహమే నా స్వర్గసీమ అని శాస్త్రీజీ అడుగుజాడలలో నడిచింది. చైనా వారి యుద్ధాన్ని ధీటుగా ఎదిరించి,పొట్టివాడైనా గట్టివాడనిపించుకున్నారు. నిస్వార్థ రాజకీయ నాయకులు శాస్త్రీజీ.ఆయనను ఇప్పటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. శాస్త్రీజీ ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
తాష్కంట్ సమావేశం లో యశాస్త్రీ జీ దివంగతులయ్యారు.ఆయన మరణానికి సరైన క్లారిటీ ఇచ్చినవారు ఎవరూ లేరు.
జై శాస్త్రీజీ. జై గాంధీజీ
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి