గాంధీజీ మార్గం

గాంధీజీ మార్గం

    
జయంత్ ఫ్లైట్ దిగి తన ఊరైన మణిపూర్ కి వెళ్ళాడు. తను చదువు కోసమని అమెరికా వెళ్లి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది. ఇంట్లో వాళ్లకి వస్తున్నానని ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాడు.
అలా వాళ్ళ ఊరికి ఒక టాక్సీ మాట్లాడుకుని వెళ్తుండగా గతంలోకి వెళ్ళిపోయాడు.
అమ్మానాన్న చెల్లెలు. చెల్లెలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాడు జయంత్. ఎప్పుడు ఏదో ఒక విషయంలో చెల్లెలు ఏడిపిస్తూనే ఉండేవాడు.

చిన్న కుటుంబం అయినా ఎప్పుడు సరదాగా  , ఆనందంగా ఉండేవారు.  తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తప్పనిసరి పరిస్థితుల్లో పై చదువులు చదువుకోడానికి అది ఇంట్లో వాళ్ళు బలవంతం మీద అమెరికా వెళ్ళవలసి వచ్చింది. వ్యవసాయ కుటుంబం ఒక ఎకరం పొలం ఉంది. ఆ పొలంతోనే జయంత్ , తన చెల్లిని చదివించి పెళ్లి చేయాలనుకున్నాడు వాళ్ల నాన్న మూర్తి. జయంత్ అమెరికా వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసేవాడు.

మణిపూర్ వచ్చేసారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుండగా ఊరు మొత్తం చిందరవందరగా ఉంది. మళ్లీ ఎవరు ధర్నాలు చేస్తున్నట్టున్నారు పోలీస్ వాళ్ళు పోలీసులు వారిని ఆపుతున్నారు. ఇలా చిందరవందరగా కనిపించేసరికి కొంచెం భయంగానే ఇంటికి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు జయంత్. వాళ్ళ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ‘ఏంటబ్బా… నాన్న ఫోన్ ఎప్పుడు స్విచాఫ్ రాదు  కదా , ఈరోజు సడన్ గా నాన్న ఫోన్ స్విచాఫ్ రావడం ఏంటి? అని అనుకున్నాడు జయంత్.’

ఇంటికి వెళ్లి చూడగా  ఇల్లు మొత్తం నిప్పుల్లో ఖాళీ అయిపోయింది. అసలు ఏమైంది అని తెలుసుకోవడానికి , అక్కడ అడగడానికి కూడా ఎవ్వరూ లేరు. అక్కడ కాసేపు ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జయంత్. తను ఫ్రెండ్ సిబిఐ ఆఫీసర్. ఇద్దరు కలిసి చదువుకున్నారు మంచి స్నేహితులు కూడా.  అసలు వాళ్ళ ఊరులో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు.

జయంత్ వెళ్లిన రెండు రోజులు తర్వాత , “రేయ్… సాగర్ అక్కడ ఏం జరిగింది రా , నాకు అన్ని వివరాలు కావాలి?” అని అడిగాడు జయంత్. “మణిపూర్ లో రెండు ఊర్లు కొట్టుకుంటున్నాయని నీకు తెలుసు కదరా… , ఆ ఊర్లో ఇప్పుడు కొట్టుకొని మరొక ఊరు వాళ్ళు మీ ఊరిని ధ్వంసం చేసేసారు. ఆడపిల్లల్ని నడిరోడ్డు మీద నగ్నంగా నడిపించారు. వాళ్ళు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మీ చెల్లెలు కూడా ఉంది. అందులో మీ వాళ్ళందరూ చనిపోయారు” అని బాధగా చెప్పాడు సాగర్.

ఈ విషయాలన్నీ విన్న జయంత్ అక్కడే కుప్పకూలిపోయాడు. గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. “అలాంటి రాక్షసులు వదలకూడదు రా…, ఏదో ఒకటి చేయాలి రా” అని బాధతో చెప్పు ఏడుస్తూ అన్నాడు జయంత్. “వాళ్ళు ఎవరో మనం కనిపెట్టాలి రా…, అలాగే అయితేనే కోర్టులో వాళ్ళు చేసిన నేరాన్ని నిరూపించవచ్చు” అని చెప్పాడు సాగర్. “కానీ ఎలా కనిపెట్టాలి రా…? ఎలా తెలుసుకోవాలి?” అని అడిగాడు జయంత్.

“నేను తెలుసుకుంటాను. మా వాళ్ళ చేత లోతుగా విచారణ చేయిస్తున్నాను. నువ్వు ఇలా  బాధపడుతూ ఉండడం మంచిది కాదు , నువ్వు ఒక మంచి జాబ్ చూసుకో బిజీగా ఉండడం వల్ల మనసు మారుతుంది” అని చెప్పాడు సాగర్. “సరే రా…” అని చెప్పాడు జయంత్. ఒకరోజు రాత్రి 10 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉండలేక బయటికి వెళ్ళాడు జయంత్. కొంత దూరం వెళ్లిన తర్వాత  కొద్దిగా దూరంగా బస్ స్టాప్ లో ఒంటరిగా ఒక అమ్మాయి ఉంది.

అమ్మాయిని చూస్తున్న జయంత్ తన దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆ అమ్మాయి తానని అపార్థం చూసుకుంటుందని కొద్దిగా దూరంగా బైక్ ఆపి అక్కడ సిగరెట్ తాగుతున్నాడు. ఒక గంట తర్వాత ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడి తన బైక్ మీద తీసుకొని వెళ్ళాడు. జయంత్ కి ఎందుకు అనుమానం వచ్చి  , వాళ్లని ఫాలో అయ్యాడు. జయంత్ ఫాలో అవడం చూసి అతను అమ్మాయిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.

రెండు రోజుల తర్వాత అమ్మాయి చనిపోయిందని న్యూస్ ఛానల్ లో చెప్పారు. ఏం జరిగిందని సాగర్ ని అడిగితే , “ప్రేమ పేరు చెప్పి అత్యాచారం చేసి చంపేశారు” అని చెప్పాడు. నెల తర్వాత సాక్షాధారాలు లేవు అని కోర్టులో కేసు కొట్టేశారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. “ఆ దుర్మార్గులను ఎలాగైనా శిక్షించాలి?” సాగర్ కి చెప్పాడు జయంత్.

“ఈ దేశంలో గాంధీజీ పోరాటం చేసిన కూడా న్యాయం జరగదు రా… ఎందుకంటే ఆ గాంధీజీ ఒక చెంప మీద కొట్టితే మరొక చెంప చూపించాలి అని చెప్పిన , ఇప్పుడు మాత్రం మంచి ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు ఉన్న సమాజంలో మనం అహింస  , సత్యం , ధర్మలను పాటించడం వల్ల తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. నువ్వు కూడా గాంధీజీ  గారిలా ఆలోచిస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయలేము” అని చెప్పాడు సాగర్.

ఒక నెల రోజులు తర్వాత గతంలో శృతి అనే అమ్మాయిని ప్రేమ పేరు అత్యాచారం చేసి దుర్మార్గులకు ఏమయిందో కానీ వాళ్ళు జీవచ్చంలా మంచానికి అంకితం అయ్యారు. వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం నరకం అనుభవిస్తూ ఉంటారు అని న్యూస్ ఛానల్ లో చెపుతున్నారు. అది విన్న జయంత్ ఆనందంగా ఫీల్ అయ్యాడు.

మరో రెండు రోజులు తర్వాత మణిపూర్ లో జరిగిన సంఘటనలకు ఉగ్రవాదులు కారణమని తెలిసి , ఆడవాళ్ళను నడిరోడ్డు మీద నగ్నంగా నడిపించడానికి కారణం కూడా వాళ్ళే అని వాళ్లని ఎన్కౌంటర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు పై ఆఫీసర్స్.
ఈ మాట విన్న జయంత్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నా చెల్లి ఆత్మకి శాంతి కలుగుతుంది అని అనుకున్నాడు. సాగర్ ఇది అంత చూసి చిన్నగా నవ్వుకున్నాడు. 

వీటి అన్నిటిని ఎవరికీ తెలియకుండా చేసింది మాత్రం తానే అని అనుకున్నాడు. శృతిని అత్యాచారం చేసి వాళ్లని ఫాలో అయ్యి , వాళ్ళు తాగే మందులో కాళ్ళు , చేతులు పడిపోవడానికి ఒక ఆయుర్వేదం మందు కలవడం వల్ల ఆ దుర్మార్గులు మంచానికి అంకితం అయ్యేలా చేశాడు. మణిపూర్ లో జరిగిన సంఘటనలకు కారణమైన వాళ్ళందరిని ఉగ్రవాదలాగా చిత్రీకరించి పై ఆఫీసర్స్ తో మాట్లాడి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసాడు ,అనుకున్నట్టుగానే ఎన్కౌంటర్ చేశాడు సాగర్.

ఇలాంటి దుర్మార్గులు ఉన్నంత కాలం గాంధీజీ మళ్ళీ పుట్టిన ఇలాంటి నేరాలకు పాల్పడిన వాళ్ళు మారారు. గాంధీజీ మార్గంలో పయనించాలి కానీ అన్ని సందర్భంలో కాదు.. అహింస పాటించాలి కానీ అన్ని సందర్భంలో కాదు.. అది గుర్తు పెట్టుకోండి..

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *