గతం

గతం

గమనిస్తున్నా..

పయనిస్తున్నా..

గతాన్ని ముడిపడి అడుగేస్తున్నా..

గతులు గుంతలుగ కనిపిస్తున్నా..

గమ్యం కోసం

రమ్యత కోసం

సాహసదారుల సాయంచేసి..

సాధన చేస్తున్నా..

మునుపటి తప్పుల

ముప్పులు మరువక..

రేపటి కిరణపు

కాంతుల కోసం..

ఆశయసాధన ఆంక్షల దిశగా..

పరుగెడుతున్నా..

గతం వదిలిన అనుభవాలతో

తెలివిగ ముడిపెడుతున్నా..!

– భాను శ్రీమేఘన

Related Posts