గతము గంభీరమాయె

గతము గంభీరమాయె

గతాన్ని
నెమరు వేయ
మిగిలెనాకు
కమ్మని అనుభూతులు.

అందని
ఐరావతము
అందలాలెక్కించె.
వరించునేమో
వయ్యారి జీవితము
అని వర్తమానము
వగలు పోతుండె……!

వెర్రి కుంకనై
విహంగ పక్షినైతి……!

తల దాచ
గూడు కానరాకుండె.
అలసిన కాళ్ళు నిలుప
భూమి చెంత లేని
చింత ఆయె ………..!

వర్తమానము
ఇట్లు గమ్మత్తాయె!
గతము గంభీరమాయె!

అవ్వునా గతము
నా సొంతము…..!
నిలకడ వొచ్చి
మళ్ళీ నిల్చుందునేమో….!

– వాసు

Related Posts