గాయమైన మనసు
ఈరోజు ఎందుకో నా మనసు
ఏదో ఆనందానికి లోనవుతూ
గతంలో అయిన ఎద గాయాలు అయినప్పుడు
కాలం గడిచే కొద్దీ నా గతం మర్చిపోయేలా
జీవితం బిజీ అయిపోవడం వల్ల
ఆనాటి గాయాలను మనసు కూడా మార్చింది..
గాయమైన గతం తాలూకు జ్ఞాపకాలను వెంటాడుతూ
నా జీవితం పయనం ఎటు వైపో
నాకే అర్థం కావడం లేదు..
ఎదకి గాయం అయితే మందే లేదు
నాలో మార్పు వస్తుంది అని నేనే అనుకోలేదు..
చెప్పినంత తేలిక కాదు గతం మర్చిపోవడం
నా మనసు జీవితంలో జరిగే ప్రతి సంఘటనంతో
యుద్ధం చేస్తూనే ఉన్నా
అప్పుడప్పుడు గతం గుర్తుకి వచ్చి నన్ను ఇంకా శూన్యంలోకి తీసుకొని వెళుతుంది.
ఎద గాయాలు ఎన్నో అవుతూనే ఉంటాయి..
గాయమైన మనసు మార్చడం చాలా కష్టం..
నేను మాత్రం గమ్యం మీదే దృష్టి పెట్టాను..
-మాధవి కాళ్ల