గీతం
బలమైన బలమేదో
చూపై నను తాకాలి
అలల్లాంటి అలజడేదో
అక్షరమై నను చేరాలి
ఆపాదమస్తకాన్ని కుదిపే
పదమేదో పథమవ్వాలి
ప్రగతిశీల పాదాల సాలులో
పయనమయ్యి పాడాలి
ఒక గీతం…
నిన్నటి ఆర్తి గీతం…
రేపటి ఆశా గీతం…
ఎప్పటికి నిజమై
నిలిచే ఒక స్వేచ్ఛా గీతం…
– అమృతరాజ్
చాలా బాగుంది రాజ్ గారు