గెలుపు గింజలు

గెలుపు గింజలు

అక్కడ ఆ నగర నడిబొడ్డున నిన్న మొన్నటి వరకు
వణుకుతున్న రాజ్యం

నిఘా నీడలో
భగ భగ మండే లాఠీల
కరాళ నృత్యం కన్నీటి వర్షంలో పసి బుగ్గల నుండి పండుటాకుల వరకు బిగి పిడికిళ్ళై నిల బడ్డనేల

అన్నం ముద్దలు పెట్టి లాఠీ దెబ్బలు తిన్న దేహాలు
నెత్తురు చిందుతున్న రణ నినాదాల మధ్య వాళ్ళు ఒక్క కలను కన్నారు

వరి గింజలపై బుల్లెట్ల వర్షం కురిసినా నిలబడ్డ తలవంచని వరి కంకులు

హలం వణకలేదు బెణక లేదు
చస్తే నేలకు ఎరువుతామన్న ధీమా విజయం వరిస్తే బతుకు పంటవుతామన్న లక్ష్యం ముందు అహంకారపు
ఫాసిజం మోకరిల్లింది

సమరంలో గెలుపు గింజలు విజయకేతనంతో నేలను ముద్దాడాయి

తేదీ :-25/11/2021

రచన
——-

రహీంపాషా మహమ్మద్
చరవాణి :-
8008748426

అంతర్జాతీయ ఉత్తమ రచయిత

-రహిం పాష

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *