గెలుపు – ఓటమి
ఈ జీవన పోరాటం మన పుట్టి,
పెరిగి, తనువు చాలించేదాక
సాగుతూనేవుంటుంది….
బతుకు పోరాటం…… తల్లి కడుపులో నుండి మెుదలు
మనం భూమి మీదకు వచ్చి
మరల తనువు చాలించేదాక
సాగుతుంది పోరాటం…..
చిన్నప్పుడు తప్పటడుగు లకు
పెద్దయ్యాక చదువు కొరకు,
ఆపై ఉద్యోగం కొరకు…..
ఆపై పెళ్లి, పిల్లలు కొరకు
ఆపై వృద్ధాప్యమందు….
ఇలా జీవన పోరాటం సాగుతుంది నిరంతరం.,..
ఈ పోరాటం లో……… కొందరికి గెలుపు…..
కొందరికి ఓటమి లభిస్తుంది.
– చిరంజీవి. బి