ఘటన

ఘటన

నిజ జీవితంలో జరిగిన ప్రతి ఘటన కథలుగా మారిపోతున్నాయి

ఎంతలా అంటే నిజం కూడా కట్టుకథగా తలపించేలా …!
నడి సముద్రంలో ప్రయాణించే నావ లాగా మారిపోయాయి రోజులు..

ఎవరికి వారే భవిషత్ తరాలకి ఎదో ఇవ్వాలని ఆరాటం మాత్రం కాదు…
తమ స్వార్థం కోసం తీసే పరుగులు మాత్రమే…
అయినవాళ్ళు లేరు, ఉన్నవాళ్లు అయినవాళ్ళు కారు…

సమాజం కోసం తపనపడి జివించేవాళ్ళు ఒకప్పుడు ఉన్నారు అని చెప్పుకోడానికి

అప్పుడప్పుడు చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ఆ రోజు భోజనం చేసి పడుకోవడమే ఆనవాయితీ
అభివృద్ది పేరుతో ఇప్పటికే మన ఆయు ప్రమాణం తగ్గటమే కాకుండా ముందు తరాలకి బ్రతికే స్వేచ్ఛని కూడా హరించేశాం….
కాంతి వేగం పుంజుకుంది
కాలప్రమాణం దిశ మార్చుకుని తిరుగుతుంది, ఋతువులు కొత్త రూపాన్ని ధరించి వస్తున్నాయి…
దిక్కులు పిక్కటిల్లేలా ధరణి ఘోష వినిపిస్తుంది…

సాగరం ఎదురు చూస్తుంది పుడమిని మ్రింగుటకు…
మృత్యువు కౌగిట్లోకి ఆహ్వానిస్తుంది….
ఈ ప్రపంచం లో నిశబ్దంగా జరిగే అంతరయుద్దాలకి లెక్కలేదు….
బాహ్య ప్రపంచానికి యుద్ధం అనేది అభివృద్ధి పై కాలు మోపితే…
అంతరయుద్దాలు మాత్రం మానవుడి పెరుగుదలనే నియంత్రిస్తుంది…

ఇలాంటివి మరెన్నో …
నేను వినిపించలేక మౌనం గా మాట్లాడుకుంటూ ఉన్నా ఘటనలు….

– కుమార్ రాజా

Related Posts