సరస్వతీ కటాక్షం రెండో భాగం

ఘట్టం - ఒకటి

సరస్వతీ కటాక్షం రెండో భాగం

ఎలా మొదలైయింది ఎలా కొనసాగుతుంది.

చిన్నప్పుడు తన మావయ్య వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తే అక్కడ వేదాల ప్రాముఖ్యత, శాస్త్రాల అర్థం నేర్చుకున్నాడు.సంస్కృతము మరియు తెలుగు లిపి మీద తనకి ఒక మంచి అభిప్రాయము తయ్యారయింది. ఒక చినుకంత అభిమానము, అతనికి ఒక తుఫానంత గాలి రూపాంతరం చెందింది తెలుగు భాష మీద. పంచాంగములో ఉండే రాశులు, నక్షత్రాలు నేర్చుకున్నాడు. ఎలాగో పౌరహిత్యము చేసే తన మావయ్య అందులోని తెలిసిన శ్లోకాలు నేర్పించాడు. తనకి శ్లోకాలు నేర్పించడమే కాకుండా వాటి నించి ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచాడు. ఆ మేనల్లుడి రాశి మిధున రాశి, పునర్వసు నక్షత్రము మూడవ పాదం, శ్రీరామ చంద్రుని నక్షత్రానికి తగినట్లు తనకు భగవద్గీత నించి ఒక ప్రభావవంతమైన శక్తివంతమైన దుష్టశక్తులను తరిమికొట్టే మనోధైర్యాన్ని పెంచే, మంత్రం, ఒక శ్లోకం ఎంపిక చేసి సాధన చేయించాడు.

ఆ శోకము ఒక జపముగా నిరంతము చేసేవాడు, ముఖ్యంగా పట్టపగలు సూర్యోదయం సమయంలో పఠించేవాడు. అలా ఆ శోకము వలన గడ్డిపరకలా బలహీనంగా ఉన్నప్పుడలా కొండ ఏనుగంత బలము సమకూర్చుకునేవాడు. ఆ విధంగా.. మొదలైయింది, మరియు ఒక శ్లోకము కాస్తా తన జీవితములో విద్యా. లా రూపాంతరం చెంది చదువులో ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.. ఆరవ తరగతిలోనే ప్రపంచంలోనే మొదటి డభై ఐదు స్థానాలలో ఒలింపియాడ్ పరీక్షలో “తనని నిలబెట్టింది. అలా ప్రయాణం మొదలయ్యింది. తరువాయి భాగం లో, ఇలా ప్రయాణం కొనసాగింది.

పెద్దయ్యాక ఐఐటీ పట్టా అందుకున్నాక, తన దెగ్గర ఉద్యోగం అవకాశం రావడానికి దాదాపు ఏడాది పట్టింది. ఈ ఏడాదే తన జీవితమును మలుపు తిప్పింది. మొదటిగా ‘ ఓం శ్రీ చైతన్య ‘ కాలేజీలో చదివించారు చిన్న పిల్లల్ని. తను మొదటిగా జూనియర్ లెక్చరర్ గా ఒక ప్రభుత్వ కళాశాల లో అడుగు పెట్టాడు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పిల్లల కష్టాలను సొమ్ము చేసుకునే కారణంగా, బడికి దూరమయ్యారు. కానీ ఆ ఊరి పిల్లలకి అదృష్టం శని పట్టినట్లు పట్టింది, కాబట్టి ఈ లెక్చరర్ తమకు దెగ్గరయ్యారు. గ్రామపెద్దతో భేటీ అయిన అతను.. గ్రామజనాల మధ్య ఏమన్నాడంటే, అబ్దుల్ కలామ్ వంటి ఆయన రామేశ్వరం లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, మిస్సైల్ మాన్ అవ్వడం గురించి చెప్పి, చదువు వల్ల మర్యాద ఒస్తుంది అని అన్నారు.

ఊర్లో కూలీ పని చేసుకునే వాడు ఎంత సంపాదించున్నా ఆఖరికి కూలీ వాడు అని అంటారు. అదే ఒక పదిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి జీతం తక్కువ ఉన్నా, గారు అని సంభోదిస్తారు. ఒకానొక సమయంలో, పిల్లల్ని నిర్భంధించి పనులు చేయించుకునే క్రమంలో, వీడయే క్లాసులు రూపంలో థియేటర్లలో చదువుకునే పరిస్థితి నెలకొంది. ఈ చదువు ఒక ఉద్యమంగా, బానిసత్వ బ్రతకు సంకెళ్లను తెంచింది.

అది మాత్రమే కాకుండా, సమాజంలో కులం వివక్ష పిల్లలపై ప్రభావం చూపకుండా, ఈ లెక్చరర్ చేసేవారు. అందరూ అందరి మీద ఆధార పడుతునప్పుడు, అందరూ సమానమే అన్న ధోరణి తీసుకొన్నారు. ఈన మాట కాదని కులం మాట తెస్తే గెట్ అవుట్ అనే వారు, ఆఖరికి పేద వాళ్ళ రక్తం ఖర్చుపెట్టి తెచ్చుకునే విద్యని కార్పరేట్, ప్రైవేట్ సంస్థలు అందిస్తు ఉండగా, పేద వాళ్ళ రక్తం తాగే రాక్షసులుగా వారు చరిత్రకెక్కారు.

-హరిశ్వర్

నీజన్మకు తోరణం Previous post  నీజన్మకు తోరణం
ఘట్టం - రెండు Next post సరస్వతీ కటాక్షం మూడో భాగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close