జ్ఞాపకాల శుభరాత్రి
ఆగిపోనీ ఆశలెన్నో మర్చిపోలేని కలలెన్నో
చెప్పరాని ఊసులెన్నో చెప్పక దాచిన భాసాలెన్నో
గడిచిన మధుర కథలెన్నో కథల
వ్యధల సోదల కన్నీటి గాథలెన్నో
మధుర స్మృతుల జ్ఞాపకాలెన్నో
ఒక్క క్షణం ఆలా స్పృశించిన వేళా
కాలం తాలూకు అనుభవాల
సారాంశ జ్ఞాపిక డైరీ తెరచిన వేళా
ఒక్కో అక్షరం ఒక్కో అనుభూతి
ఒక్కో అక్షరం ఒక్కో భావ సరళం
ఒక్కో అక్షరం ఎన్నో ఆత్మీయ
ప్రేమ బంధాల పెన్నిది…,
కొన్ని మధుర ఆలోచనల సన్నిధి
జ్ఞాపకాల తడిలో మనసా ఆలోచనల
వడిలో ప్రతి పుటం అమితానందం
నిత్యనూతన శోభిత వైభోగ రంజిపమయం
జ్ఞాపకాలు రసామృతం కొన్ని కన్నీటి విలాపమయం..!
జ్ఞాపకాల చిట్టా అదో మాదిరి తేనె తేట్ట
ఆస్వాదిస్తే రుచి అమృతమయం…!
లేకుంటే మనసు ప్రళయ వేదం
తవ్వితే నిధి తోమితే నిశి
ప్రణయిస్తే ప్రేమ కావ్యం విషాధిస్తే శోక మయం
మరుపు ఉంటే హాయ్ మయం
లేకుంటే అంత అదో భారమయం..!
ఇదే అక్షరకావ్యశ్రీ భావమయం
శుభరాత్రి మధుర కలల ఆహ్వానమయం..!!
– సైదాచారి మండోజు