జ్ఞాపకాల మడుగు
జ్ఞాపకాల కొలనులో..
జ్ఞాపకాలను తవ్వి తీస్తుంటె..
బావిలో పూడిక తవ్వి తీస్తే..
నీళ్ల ఊట ఎలా ఊరుతుందో..
నా మనసనే బావిలోంచి..
పూడిక తీస్తుంటె…
నా జ్ఞాపకాల ఊట అలా వస్తుంది..
చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు..
పెద్దయ్యాక కలిగిన చేదు జ్ఞాపకాలు..
ఎన్నో! ఎన్నెన్నో!!
మధుర జ్ఞాపకాలను తలుచుకుని..
మురిసి పోవాలో!
చేదు జ్ఞాపకాలను తలుచుకుని
కుంగిపోవాలో! అర్థం కాని పరిస్థితి..
అందుకే ఈ జ్ఞాపకాల గనిని..
తవ్వకుండా…
వాస్తవాల జడి లోనె తడవాలని..
నిర్ణయించుకున్నా!
కానీ…
నా మది గది అలా ఊరుకోదే!
తాళం వేసి పెట్టినా..
పగల కొట్టుకుని మనసు గది..
తెరుచుకుంటుంది..
జ్ఞాపకాల ఊటను పైకి తెస్తూనె..
ఉంది..
జ్ఞాపకమా! నా దరికి రాకే!!
నన్నిలా బ్రతకనీయవే!!
-ఉమాదేవి ఎర్రం