గోడలకు చెవులుంటాయి
అవును సుమీ!
గోడలకు చెవులుంటాయి..
ఎలాగంటారా?
ఎవరూ లేరు కదాని మనం ఏదేదో మాట్లాడుతుంటామా? గోడ చాటునుండి విని లేని పోని గొడవలకు దారిని తీసే వాళ్లుంటారు..
ఈ మధ్య కాలంలో గోడలకేమెా కానీ సెల్ ఫోన్ చాటు
నుండి వినడమెా! లేదా అవతలి వాల్లు కట్ చేయక పోతే వాల్ల అసలు మాటలు వినడమెా అనర్థాలకు దారి తీస్తుంది..
మెున్నోసారి ఏమైందంటే మాకు దూరపు వరుస అక్క
అవుతుంది ఆవిడ ఫోనంతా మాట్లాడి బై అంది కానీ
ఫోన్ పెట్టడం రాదేమెా! పక్కన ఉన్న వాళ్లకి ఏదేదో చెప్తుంది..
అనుకోకుండా విన్నాను కానీ ఏమీ అనలేం కదా! కానీ
వాల్ల మీదున్న అభిప్రాయం మాత్రం మారిపోయింది
తరువాత నుండి వాల్లతో మంచిగా ఉండలేక పోతున్నా!
ఫోన్ కి వింత చెవులున్నాయి..
చెప్పుడు మాటలకన్నా ప్రమాదమయేవి..
ఏమంటారు? ఫ్రెండ్స్!!
– ఉమాదేవి ఎర్రం