గొడ్రాలు

గొడ్రాలు

గొడ్రాలు

కుమార్, కవితలకు పెళ్లయి రెండు సంవత్సరాలయింది. ఇప్పుడు దాకా వాళ్లకు పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన ఎన్ని మందులు వాడిన ఫలితం లేకుండా పోయింది. అయితే కవితని వాళ్ళ అత్త మామ పట్టించుకోవడం మానేశారు.  ప్రతిరోజు కవితని సూటిపోటి మాటలతో బాధపెడుతూ ఉండేది సరోజిని.

“పూర్వ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అమ్మ అనే పిలుపుకి దూరమయ్యాను” అని బాధపడుతుంది కవిత.
“నువ్వేం బాధపడకు కవిత మనకి తప్పకుండా పిల్లలు పుడతారు” అని ధైర్యం చెబుతూ వచ్చాడు కుమార్.
ఏ శుభకార్యానికి వెళ్ళిన కూడా నువ్వు గొడ్రాలివి అని అందరూ అంటుంటే కవిత భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తది.

ఊరు చివర్లో ఒక బావి ఉంది. ఆ బావిలో కవిత దూకపోతుండగా పక్కనే ఉన్న పొదల్లో పసిపాప ఏడుపు వినిపిస్తుంది. అక్కడే వెళ్లి చూడగా ఒక తల్లి  ప్రసవించి చనిపోయిద్ది. ఆ పసిపాప ఏడుపు చూడలేక కవిత తీసుకొని ఇంటికి వెళుతుంది. తన బిడ్డగా పెంచుకొని అమ్మ ప్రేమని పంచుతుంది. గొడ్రాలు అన్న వాళ్లే ఇప్పుడు ఒక ఒక బిడ్డకు తల్లివయ్యావు అని అంటుంటే సంతోషంగా ఉంది కవితకి.

కవిత అత్త మామ మాత్రం ఆ పాపని మనవరాలుగా ఒప్పుకోలేదు.  కవితకి ఆ పాప దొరికి రెండు సంవత్సరాలు తర్వాత తను తల్లిని కాబోతున్నాను అనే శుభవార్త తెలిసింది. కుమార్ , కవితలకు ఈ ఆనందం రెట్టింపు అయింది. 9 నెలలు తర్వాత కవితకి బాబు పుట్టాడు. తమకు దొరికిన పసిపాపకి మాత్రం అమ్మ నాన్న ల ప్రేమని ఇద్దరికి సమానంగా పంచుతూ చూసుకుంటున్నారు.

కవిత పసిపాపతో అమ్మ అనే పిలుపు పిలిపించుకున్నందుకు ఆ పాపకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ తన కన్న కొడుకుతో సమానంగా చూసుకొని అమ్మ ప్రేమని పంచుతుంది. దొరికిన బిడ్డను మర్చిపోయి కన్న బిడ్డకే ప్రేమ పంచే వాళ్ళు ఉన్నారు. తాను గొడ్రాలు కాదు ఒక బిడ్డకు తల్లి అని నిరూపించుకుంది.

– మాధవి కాళ్ల

నా అరాద్యదైవం Previous post నా అరాద్యదైవం
అరచేతి వైకుంఠం Next post అరచేతి వైకుంఠం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close