గ్రంథాలయం

గ్రంథాలయం

ఆ.వె.

1) ఆది నుండి మనిషి అనభవాలన్నిటీ
    పొత్తములుగజేసి పేర్చినాడు
    పూర్వ అనుభవములు పుస్తకాలై యొప్పె
    స్ఫూర్తి దాతలు మన పుస్తకాలు

ఆ.వె.

2) తాత తండ్రులంత తాము అనుభవించి
     కష్టనష్టములను కడకు నెట్టి
     సులభ మార్గములను సూచించి పోయిరి
     వాస్తవాలు మనకు పుస్తకాలు

ఆ.వె.

3) క్రాంతి దాతలు మన గ్రంథాలయమ్ములు
     వేలవేల పుస్తకాల వెలుగు
     పుస్తకములు మనకు మస్తకాలై తోడు
      నిలిచి మేలు కూర్చు నిజముగా ను

– కోట

Related Posts