గుడ్డు ఇగురు

గుడ్డు ఇగురు

రుచి ఎక్కువ, శ్రమ తక్కవతో రోజు మంచి వంటకం మీకు పరిచయం చేస్తాను. ఎప్పుడూ తినే గుడ్డు వేపుడు, గుడ్డు బుర్జి, గుడ్డు పులుసు కాకుండా నువ్వులు వేసి గుడ్డు ఇగురు ఎలా చేయ్యోలో  తెలుసుకుని చేసేద్దాం రండి…. ముందుగా దీనికి కావాల్సిన పదార్ధాలు ఏంటో చూద్దాం

కావలసిన పదార్థాలు:-
గుడ్లు – 4
నూనె – 2 టేబుల్ స్పూన్ లు.
ఉల్లిపాయలు – 4 (మీడియం సైజ్)
పచ్చి మిరప కాయలు – 4 (పెద్దవి)
నువ్వులు – 4 టేబుల్ స్పూన్ లు.
ధనియాలు – 1 టేబుల్ స్పూన్ లు.
లవంగాలు – 4
ఉప్పు – సరిపడినంత
పసుపు – 1/2 టేబుల్ స్పూన్ లు
కారం – 2 టేబుల్ స్పూన్ లు.
నీళ్ళు – అరగ్లాసు
కొత్తిమీర – పావు కట్ట…
ఇవన్ని మన నిత్యవసర వస్తువులే, అందువల్ల తయారి విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది.. ఎ కూర చేసుకోవాలో తెలియలేనప్పుడు ఈ కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూస్తె మీకే తెలుస్తుంది….
తయారీ విధానం:
ముందుగా గుడ్లును ఉడకపెట్టుకుని, వాటి పొట్టు తీసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కూర చేసే పాత్రను పొయ్యిమీద పెట్టి, నూనె వేసుకోవాలి. మంట మరీ ఎక్కువగా లేకుండా సిమ్ లో పెట్టుకోవాలి.
చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా చేసిన పచ్చిమిర్చి వేసి కాస్త రంగు వచ్చేవరకు మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చాయి అని అనుకున్నాక పసుపు, ఉప్పు వేసి కలపాలి.
ఈలోపు నువ్వులు, ధనియాలు, లవంగాలు మూడు ఒకేదగ్గర పొడి చేసుకుని పెట్టుకోవాలి. ఆ పొడిని వేగిన ఉల్లిపాయలతో కలుపుకుని, కారం కూడా వేసుకోవాలి.
రెండు నిమిషాలు తరవాత నీళ్ళు పోసి పొయ్యి చిన్న మంట మీద వుంచి, గుడ్లు వేసి, నీళ్ళు ఆవిరి అయ్యేవరకు అలాగే కలుపుతూ వుండాలి. చివరిలో చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లి పొయ్యి కట్టేసుకోవాలి.
రుచికరమైన నువ్వుల గుడ్డు ఇగురు తయారు 😋.
– రాధిక.బి

Related Posts