గుణం

గుణం

ధనం కన్నా గుణం గొప్పది అంటారు పెద్దలు
సత్వ రజో తమో గుణాలకు
గణాలు లేవు ఎవ్వరికి

స్వభావమే స్వధర్మం
అని చెప్పేదే గుణం

పుట్టుకతో వచ్చే వి కొన్ని
సహజ గుణాలు

ప్రేమను పంచుతూ పెంచేదిప్రేమ గుణం

తనకున్న దానిలో పంచేది
దానగుణం

తనది కూడా విడిచింది
త్యాగ గుణం

అర్దం కాని రీతిలో ముందుకు వెళ్ళేది
మొండి గుణం

తనకు గానిది వేరొకరి వంతు లేదు అంటే
స్వార్థ గుణం

కలివిడి మాటల మంత్రం
కలుపుగోలు గుణం

ఎదుటి వారి క్షేమం
ఏ మాత్రం లేనిది
రాక్షస గుణం

అన్నింటినీ సమానంగా
చేసేటి మంచిగుణం

పదిమంది కోసంపాటు
పడేది ఉదార గుణం

ఎవ్వరు ఏమి అన్నను
పట్టించు కోకపోవడం
క్షమా గుణం

అన్ని కష్టాలు అద్దంలో
చూస్తే సున్నిత గుణం

కష్టానికి ఎదురొడ్డి నిలిచేది
దైర్య గుణం

ఆపదలో సాయం చేసే వారు మేలు చేసే గుణం

సాటి మనిషి సాయానికి
తోడ్పడు తూంటే మానవతా
గుణం

అడిగిన దే తరువాయిఅన్నీ పంచే ధర్మ గుణం

సృష్టి ధర్మాన్ని సూక్ష్మంగా
వుంచేది శాంత గుణం

చేసే పనులు ఎవ్వరికి
హాని లేనిది పరమాత్మ గుణం

ఏది ఏమైనా ఈ ప్రపంచంలో అత్యంత
ముఖ్యమైనది
కష్టపడే గుణం మంచిది

మనకు మనంగా
జీవించాలంటే సర్డుకుపోయే గుణం

ఇంకా గొప్పది అంటే
పరిస్థితులకు “అనుగుణంగా”
వుంటే చాలు అన్ని
గుణాలు కలిసిపోతాయి మరి ………..

– జి జయ

Related Posts