గురువులకు పాదాభివందనాలు

గురువులకు పాదాభివందనాలు

అన్ని వృత్తులలో అతి ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఎందుకనగా ఎవరూ ఏ వృత్తిలో పని చేయాలన్నా వారికి ఆ వృత్తి గురించి చెప్పేది ఒక ఉపాధ్యాయుడే. అందుకే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పనైనది.

ఒక రాయి శిల్పంలా మారాడానికి శిల్పి ఎంతో కష్టపడితే కానీ రాయి శిల్పం లా మారదు. ఒక కోవత్తి తను కరిగిపోతూ తన చుట్టు  పక్కన వెలుగు ను ఇస్తుంది. అదే విధంగా ఉపాధ్యాయుడు కూడా అంతే.

ఒక రాయి శిల్పం లా మారినట్టే, ఒక మామూలు మనిషి జ్ఞానం తెలిసిన వ్యక్తిలా, ఒక ఉన్నత స్థాయికి చేరాలంటే ఒక ఉపాధ్యాయుని వల్లే సాధ్యం అవుతుంది. అందుకే మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తరువాత స్థానాన్ని గురువుకి ఇచ్చారు.

నేను చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడు అందరూ టీచర్స్ చాలా బాగా చదువును చెప్పేవారు. చదువుతో పాటు అన్ని విషయాలను తెలియజేసే వారు. 

మా స్కూల్ లో  ప్రిన్సిపల్ సార్ ఉండేవారు. ఆ సర్ మాకు హిందీ సబ్జెక్ట్ చెప్పేవారు. సర్ పేరు రాజశేఖర్ గారు. సర్ అంటే ముందు చాలా భయం ఉండేది. సర్ వస్తున్నారు అంటేనే చాలా భయం వేసేది. సర్ క్లాస్ వస్తుంది అంటేనే వామ్మో… అని అనిపించేది.

సర్ క్లాస్ ఎప్పుడు అవుతుంది, సర్ ఎప్పుడు బయటకు వెళతారు అని అనుకునేదాన్ని. అలా కొన్ని రోజులు నా భయం అలాగే ఉంది. నాకే కాదు. మా ఫ్రెండ్స్ లో చాలా మందికి సర్ అంటే భయం. సర్ అంటే అంత భయం ఉన్నా కానీ, సర్ ముందే కుర్చునేదాన్ని. కానీ ఏమీ మాట్లాడకుండా ఉండేదాన్ని.

కొన్ని రోజులకు సర్ తో, నేను చదువుతుండగా ఏమైనా డౌట్స్ వస్తే అడగడం మొదలు పెట్టాను. అలా సర్ తో కొంచం మాట్లాడే దాన్ని. అలా సర్ మీద ఉన్న భయం పోయింది. సర్ మీద ఇంకా ఎక్కువ గౌరవం ఏర్పడింది. సర్ అన్ని విషయాలు మాకు చెప్పేవారు. మేము సర్ ని ఒక తండ్రి వలె భావించేవాళ్ళం. సర్ మమ్మల్ని, తమ పిల్లల్ల వలే ఆదరించేవారు.

సర్ రోజు ఒక పెద్ద జవాబు ని చదివి, స్లిప్ టెస్ట్ రాయమని చెప్పేవారు. అలా రాయకపోతే పెద్ద పనిష్మెంట్ ఇచ్చేవారు. క్లాస్ టైమ్ అయిపోతే ముందు రోజు టాపిక్, ఆ రోజు టాపిక్ రెండు స్లీప్ టెస్ట్ రాయాలి. స్కూల్ కి వెళ్లకపోయినా ఆ రోజులలో రాసే స్లీప్ టెస్ట్ అన్ని రాసేయాలి.  అలాగే మా క్లాస్ అందరం చేసే వాళ్ళం. అందుకే అలా చేశాం కాబట్టే, అందరికీ బోర్డ్ ఎగ్జాంలో మంచి మార్కులు వచ్చాయి.

ఆ స్కూల్ వదిలి వెళ్ళినా, సర్ ని మేము మరవలేదు.
సర్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను ఆ దేవుడిని వేడుకుంటున్నాను.

నేను ఇంటర్ లో ఉన్నప్పుడు మాకు జూలోజీ సబ్జెక్ట్ ఒక సర్ చెప్పేవారు. సర్ పేరు మహేందర్ సర్. సర్ క్లాస్ చెప్తే, సర్ చెప్పే ప్రతి విషయం వినాలి అని అనుకునే విధంగా చెప్పేవారు అంటే ఏకాగ్రత మొత్తం సర్ చెప్పే పాఠం మీద ఉండే విధంగా చెప్పేవారు. చెప్పే లెస్సన్ లో ఒక టాపిక్ గురించి చెప్పేటప్పుడు ఆ టాపిక్ మీద ఉన్న పూర్తి విషయాన్ని అవగాహన కలిగే విధంగా అన్ని విషయాలను చెప్పేవారు. 

సర్ క్లాస్ను అస్సలు మిస్ అవ్వకూడాదు. మిస్ అయితే ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం కోల్పోతాము అనీ అనుకునే విధంగా పాఠం చెప్పేవారు. బుక్ లో ఉన్నది మాత్రమే కాకుండా సబ్జెక్ట్ కి సంబందించిన జనరల్ విషయాలను గురించి సమయం ఉన్నప్పుడు మాతో చర్చించి, పూర్తి విషయాలను తెలియజేసేవారు.

ఈ చదువు పూర్తి చేశాక, పెద్ద చదువులు ఏవి చదివితే మంచి స్థాయిలో ఉండవచ్చు అనే విషయాలను మాకు తెలియజేసేవారు. ఏ చిన్న డౌట్ వచ్చినా, ఆ విషయాన్ని పూర్తిగా అర్థం అయ్యే రీతిలో వివరించి చెప్పే వారు.

కాలేజ్ అయిపోయాక కూడా సర్ ను, కెరీర్ గురించి ఏ డౌట్ వచ్చినా అడిగితే చక్కగా చెప్పేవారు.

సర్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

నేను డీ ఎడ్ లో ఉన్నప్పుడు సైకాలజీ సబ్జెక్ట్ నీ వాహిద్ అలి సర్ బోధించేవారు. సర్ చాలా చక్కగా అర్ధం అయ్యే విధంగా చిన్న టాపిక్ ని కూడా పెద్దగా విశ్లేషించి చెప్పేవారు. సర్ క్లాస్ ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండే వాళ్ళం మేమంతా. సర్ క్లాస్ చాలా ఏకాగ్రత లో వినేవాళ్ళం. 

వీరే కాదు నేను ఇంత చదువు చదివి, నాకు ఇంతటి జ్ఞానాన్ని బోధించి, నన్ను తీర్చి దిద్దిన ప్రతి ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలకు పేరు పేరునా 
నా పాధాభివందనాలు. 

ఇలాంటి మా ఉపాధ్యాయుల గురించి రాసే అవకాశాన్ని ఇచ్చిన అక్షరలిపి వారికి నా ధన్యవాదాలు.

– అనూష, వరంగల్.

Related Posts

1 Comment

  1. మీ గురువులను ఈ సందర్భంగా తల్చుకున్నారు, సంతోషం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేస్తమా…

Comments are closed.