గురువు అంటే?

గురువు అంటే?

 

గురువంటే ఒక గ్రంధాలయం
గురువంటే ఒక విజ్ఞాన పీఠం
గురువంటే ఒక శక్తి
గురువంటే ఒక భక్తి భావం
గురువంటే చీకటిలో చిరు దీపాన్ని
వెలిగించే ఒక మహా జ్ఞాని
తల్చుకుంటే పశుల కాపరిని
మహా రాజుని చేసేంత మేధావి
విద్యార్థి జీవితాన్ని దిశా నిర్దేశం
చేసి భవిష్యత్తు రంగుల మయం
చేయగల శక్తి పరుడు
నిరంతర విద్యార్థిగా ఉంటూ
నేర్చుకోవలసింది చాలా ఉందని
తెలిపే వాళ్ళు గురువులు ,
తన శిష్యులు బాగు పడాలని
కోరుకునే వారు గురువులు ..
కానీ…. ?
ఇదంతా ఒకప్పుడు ..

మరి ఇప్పుడు ?

గురువు అనే పదానికి
అర్ధం మారింది
డబ్బుంటేనే మార్కులు వేస్తా అనే వారు ఒకరు
నీ శరీరాన్ని నాకు పంచు అనే వారు ఒకరు
చిన్న పిల్లల పై అత్యాచారాలు చేసే వారు ఒకరు
నువ్వు బాగున్నావు నాకేంటి లాభం అనే వారు ఒకరు
నా ఆకలి తీర్చు అనే వారు ఒకరు
వెకిలి చేష్టలు చేసే వారు ఒకరు
అతి ఘోరమైన శిక్షలు వేసే వారు ఒకరు
వాతలు తెలేలా కొట్టే వారు ఒకరు ,
మార్కుల కోసం , గ్రెడుల కోసం , ర్యాంకుల కోసం
సతయించే వారు ఒకరు ,
కానీ

ఇదంతా ఒకప్పుడు ….
కరోనా కాలానా
పాఠాలు చెప్పే పంతుళ్లు
చెప్పడానికి విద్యార్థులు లేక
చేయడానికి పని లేక
తినడానికి తిండి లేక
అడగడానికి మనసోప్పక
ఆత్మాభిమానం చంపుకోలేక
అందరిలో మాటలు పడలేక
చులకన గా చూస్తున్న వారికి సమాధానం చెప్పలేక
అప్పుల బాధలు పడలేక ,
ఆదరించే వారు కరువైన కాలాన
భార్యా పిల్లలను పస్తులు పడలేక
అడుక్కోవాల్సిన పరిస్థితిలో
ఆత్మాభిమానం ఆభరణంగా
అరటి పండ్లు అమ్ముకున్న వారు ఎందరో
చెప్పులు కుట్టి న వారెందరో
కూలీ పనులు చేసిన వారెందరో ,
సగం కడుపుకు తిన్న వారెందరో ,
బతుకు భారమై , కన్న వారిని ,
కట్టుకున్న వారిని , కడుపున
పుట్టిన పిల్లలను చంపుకున్న వారు ఎందరో
ఫీజులు వసూలు చేయలేక , జీతాలు ఇవ్వలేక
అప్పుల వారికి సమాధానం చెప్పలేక ,
తనువులు చాలించిన వారెందరో 😭😭😭😭😭😭😭😭
వారికి మనం ఏమీ చేయలేక పోయినా ,

కనీసం ఈ టీచర్స్ డే అయినా వారిని తల్చుకుంటూ , వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం 🙏🙏🙏🙏🙏

 

– భవ్య చారు

Related Posts

2 Comments

  1. అన్ని విధాలుగా అర్ధవంతగా తెలిపారు భవ్య గారు. అలాగే హ్యాపీ టీచర్స్ డే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *