గువ్వల జంట

గువ్వల జంట

నాలో నీవు నీలో నేను లీనం కావాలంటే

కలలు కలలు కన్నాము మన ఇద్దరమూ ఒకటి అవ్వాలని..

అది ఏ నాటి కోరికో ఈనాటికీ తీరబోతున్నదని…

నేననుకున్నా..

కానీ నేననుకున్నది నా రాణి ఆ వాణి వినిపిస్తుందా..

కనిపిస్తూ చేతి వేళ్ళ మధ్య పువ్వును చూపిస్తూ…

ఆ కనుల నన్ను చూస్తూ ప్రేమతో ఇస్తుందా..

నా గుండెల నిండా అనురాగం నీవే

నా రాణిగా కొలువై ఉన్నావు..

తోడుగా కలకాలం కలిసి పోతామా

ఇలలో మనమిద్దరం…

ఈ నేలను మురిపిద్దామ వలపుల పంటగా…
నీ కంట కన్నీరు నాకు గిట్టదు..

ఓట్టుగా నీకు చెబుతున్నా…

ఆ కంట కన్నీరు కారనివ్వను..

ఒంటరి నీవు కాదు నీ తోడుగా నేనున్నాను…

నాలో నీవు నీలో నేను ఒకటైనాక…

మన ఇద్దరికీ తిరిగే మున్నది…

గువ్వల జంటగా గగన మండలం విహరిద్దామా…

ముద్దుల జంటగా..

– పలుకూరి

Related Posts