హై వే

హై వే

ఆకు పచ్చటి పొగ కమ్మేసిందా…… దట్ట మైన అడవుల గుండా ఒక సెలయేరు పారుతోందా అన్నట్టు కనిపిస్తోంది ఆ హై వే.

పచ్చని చెట్టుకు పూసిన ఎర్రని పువ్వు లా ఆ ఏర్రని కారు దూసుకు పోతుంటే నా కళ్ళు మురిసి పోయాయి హృదయంతో.

అది రాజీవ్ హై వే. పక్కా తెలంగాణ కి సింహ ద్వారం. మరి ఈ ఎర్రని పువ్వు ప్రయాణం ఏటో? ఆ కారు వేగంలో కొంత మార్పు కనిపించింది. హై వే నుంచి ఒక పిల్ల దారి గుండా అడవి లోకి ప్రవేశించింది. అలా, కొంత ప్రయాణం చేశాక ఆ కారు చక్కటి సెలయేరు కు దరిగా దట్టమైన చెట్లు, కొండలు వున్నచోట ఆగింది.

డోర్ తీసి అందులోంచి ముందుగా దిగింది నేనే. ఇలా, ఓ ఆరుగురం ప్రకృతి ఒడిలో గడుపుదామని అలా వచ్చేసాం. కొంత కాలిబాటన నడచి గుబురుగా పెరిగిన చెట్లు వున్న ఒక చిన్న గుట్ట ఎక్కి రాళ్లపై కూర్చున్నాము.

హై వే పై ఎదో దొరికింది పొట్లాలు కట్టించి తెచ్చేసుకున్నాం. కుర్ర కారులం ఇహ మాటల్లోకి దిగేసాం. మా స్నేహితుల్లో ఒకడు వాడ్ని దత్తు అని పిలుస్తాం. వాడు మెదలు పెట్టాడు ఒక గొప్ప కాంటెస్ట్.” అందం”, నీవు ఎందులో చూస్తావు? ఇహ, మేము చెప్పాలి.

మాలో ఒకడు ఇలా చెప్పాడు. “ఒక రాతి గుహలో మూడు రోజులు గడపడం. చలిమంటేసుకుని కట్టెల పొయ్యి మీద ఒండుకోవడం. ఉదయాన్నే, పక్షుల రావాలతో మేల్కొనడం. ఉదయం వంటకి ప్రకృతి కూరగాయలు అన్వేషించడం. నాకు అడవి కాకరకాయలు అంటే తెగ ఇష్టం. అవి కోసి తెచ్చి ఇహ ఫ్రై చేసుకుంటే అబ్బా…….! ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి?

ఇహ మా దత్తు గాడి వంతు. రాత్రిళ్ళు ఒక పల్లెలో చక్కగా నిచ్చెన ఎక్కి మంచె పై, లొట్టిలో నీళ్లు, ఓ ఫ్లాస్కు లో చాయ్, జేబులో సిగరెట్టు పెట్టె, రేడియో లో బాలు పాటలు ఇది వాడికి అందం అంటే.

చివరిగా, మా బృందం లో పాపారావు అని ఒక వేదాంతుడు వున్నాడు. అతను ఇలా చెప్పుతూ పోయాడు. ఓ నదీమ తల్లి ఒడిలో కూర్చుని, పక్షుల కిలకిల రావాలు వింటూ, మధ్య, మధ్యలో గులక రాళ్ళని నదిలో వేస్తూ “అమ్మా, ఎటు తల్లీ నీ ప్రయాణం?

తేనె టీగ మాదిరి నీ పరుగులు ఎటమ్మా? ఈ ఒంటరి పరుగులో నీకు వేగము అక్కెరలేదు. అది అవివేకుల సొత్తమ్మా. నీ పందెం లో అర్ధము లేనిది గెలుపమ్మా. పాపం పుట్టకనే గిట్టు. ఎండ తాకిడుకు నీవు ఆవిరై ఎత్తులు చేరతావు. ఎందుకుతల్లి నన్ను ఈ ప్రవాహన్ని చూడనివ్వవు?.”ఇలా కవిత రాయడం అని చెప్పాడు.

ఇంతలో చీకట్లు కామ్మేశాయి. మా ఆనందాల ఎర్రని కాంతి తిరిగి హై వే ఎక్కేసింది.

– వాసు

Related Posts