హితురాలు

హితురాలు

హితురాలు

నాకు స్నేహితులకన్నా ఎక్కువ ఏ భాద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది మా అమ్మా, అమ్మ కంటే స్నేహితులు ఎక్కువ కాదు, స్నేహితులు ఉన్నా కూడా ,మన చిన్నప్పటి నుండి ప్రతి చిన్న విషయాన్ని మన అమ్మతో పంచుకుంటాము….

కొంచం వయసు రాగానే స్నేహితులు దొరుకుతారు. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్నేహితులు దూరం అవుతారు. అప్పుడు తెలుస్తుంది మనకి ఎవరు మంచి స్నేహితులో, దాంతో మనం మన తల్లికి మన సమస్య ని చెప్పుకుంటాం…

చిన్నప్పటి నుండి మనకి ఏమి కావాలన్న మన అమ్మతోనే చెప్పుకుంటాం, అమ్మ నాన్నకి చెప్పి ,మనకి కావాల్సినవి అందేలా చేస్తుంది. నాన్నతో అంతగా ఫ్రీగా ఉండలేని మనం అమ్మా చాటుగా స్నేహితులతో షికార్లు చేయడానికో, సినిమాకు వెళ్తే , నాన్న మనల్ని తిడితే మనన్ని తిట్టకుండా, వాడు, అది చదువుకోవడానికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి ,మరి మనల్ని కాపాడుతుంది…..

ఎవరి సంగతి ఏమో కానీ , నా వరకు అయితే మా అమ్మ నే నాకు మొదటి స్నేహితురాలు, నాకు సంబంధించిన అన్ని విషయాల్లో , తానే నాకు స్ఫూర్తి, ఆమె చేసినట్లుగా వంట చేయాలని, అమ్మ కట్టుకునట్టు చీర కట్టుకోవాలని, అమ్మా రెడి అయినట్టు నేను రెడి కావాలని ఉంటుంది. కానీ అదేంటో ఎంత ప్రయత్నం చేసినా అమ్మలా వంట చేయలేను, రెడి అవ్వలేను..

అమ్మా నేత చీర కట్టుకున్న అందంగా కనిపిస్తోంది. నేను తినకుండా అలిగి పడుకుంటే నాకు గోరుముద్దలు చేసి ,పెడుతుంది, బుజ్జగించి, అలక పోగొడుతుంది. అమ్మా నన్ను నవ మాసాలు మోసి,కనింది, పెంచి పెద్ద చేసింది. మంచి ,చెడు నేర్పింది, అత్తారింట్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పించింది. ఎవరైనా ఏమైనా అంటే ఎలా బుద్ధి చెప్పాలో తెలిపింది….

మనం ఎవరికి చెప్పుకోలేనివి కూడా అమ్మతో చెప్పుకుంటాను ,నేను , సంసారం విషయాలు కానీ , భర్త ఎలా చూసుకుంటాడో అనే దానితో సహా అన్ని చెప్పుకుంటా, ఎందుకంటే తాను అన్ని చూసింది, అనుభవం కలది, దేనికి ఏమి చేయాలో తనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కాబట్టీ, చాలా మంది అమ్మ కి ఏమి తెలియదు అని అనుకుంటాం , కానీ అన్ని తెలిసిన విజ్ఞాన ఖని అమ్మా,..

అమ్మకి తెలియని విషయం అంటూ లేదు, అమ్మ కి తెలియని బాష లేదు. మనం మౌనంగా ఉన్నా, సైలెంట్ గా ఉన్నా, మన మూడ్ కి తగినట్లు గా మనల్ని మాములు మనుషుల్ని చేస్తుంది. మన కోరికలు, ఇష్టాలు, అన్ని తెలుసుకుని , అన్ని విధాలా మనకి నచ్చిన రుచులు చేసి పెడుతుంది….

అమ్మా ఈ పదం.లోనే ఎదో మాయ ఉంది. అమ్మని మించిన దైవం లేదు. మన చిన్నప్పటి నుండి మన అవసరాలు తీరుస్తూ, మనకి బట్టలు వేసి, మంచిగా రెడి చేసి, తన ముద్దు ,ముచ్చట్లు తీర్చుకుంటూ, మనన్ని ఎన్ని విధాలా రెడి చేస్తుంది. ఆ తర్వాత అందరి కళ్ళు పడ్డాయి అని దిష్టి తీసివేస్తుంది..

మనకు కొంచం నలతగా ఉన్నా ,తల్లడిల్లిపోతుoది. మన చుట్టూ తిరుగుతూ ,తగ్గిందా, తగ్గిందా అని నిమిషానికో సారి అడుగుతుంది.. ఇంతకన్నా మంచి స్నేహితురాలు మనకి ఎక్కడ దొరుకుతుంది. మనకే కష్టం వచ్చినా , అమ్మ గుండెలో తల దూర్చి, మనసారా ఏడిస్తే తప్ప మన భారం తీరదు కదా…..

నేను మా అమ్మ మాత్రం మంచి స్నేహితులకన్నా ఎక్కువగా , ఉంటాము, ఇవన్నీ నా అనుభవాలు.. నాకు మా అమ్మకన్నా మంచి మిత్రులు ఇప్పటి వరకు దొరకలేదు. కానీ ఈ మధ్యే ఇద్దరు మిత్రులు దొరికారు.అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వారితో కాస్త అపార్ధాలు చేసుకున్నా కూడా మళ్లీ కలిసాము. వచ్చే జన్మంటూ ఉంటే వారికి చెల్లిగా పుట్టాలని నా కోరిక..

 

-భవ్యచారు

మిత్రోత్సాహం Previous post మిత్రోత్సాహం
ప్రాణ నేస్తమా Next post ప్రాణ నేస్తమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close