హనీమూన్ జంట
రఘు, జలజ పెళ్ళి అయిన తరువాత హనీమూన్ కి బయలు దేరారు. బయలు దేరే ముందర వాళ్ళకి సింగపూర్, కొడైకెనాల్, అరకు లోయ ఎక్కడకి వెళ్లాలని ఇద్దరికి చర్చ వచ్చింది. ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. జలజ కూడా అరకు లోయ కే ఎక్కువ ఇష్టపడింది.
ప్రకృతితో మమేకమైన అరకు లోయ కు వారి కారు బయలు దేరింది. ఇద్దరికి కాటేజ్ బుకింగ్ కోసం గూగుల్ లో వెతికారు. వాళ్ళకి అప్పుడు సుబ్బలక్ష్మి గారి చిత్రంలోని కాటేజ్ నచ్చింది. వెంటనే దాన్ని బుక్ చేశాడు రఘు.
పగలు అంతా ప్రకృతిని ఆస్వాదించు, సాయంత్రం అయ్యేసరికి కాటేజ్ కి బయలు దేరారు. కాటేజ్ చూడటానికి బాగుంది. కానీ దానిలోకి వెళ్ళటం ఎలాగో తెలియ లేదు ఇద్దరికి. ఇద్దరూ కూడా పట్టణ జీవనానికి అలవాటు పడినవారాయే.
ఇంతలో అక్కడ ఉన్న గిరిజనుడు నిచ్చెన లాంటి సాధనాన్ని ఇచ్చాడు. కాళ్ళు ఒణుకుతున్నా అలాగే ఎక్కారు ఇద్దరు.ఆ ఎత్తైన చెట్టు మీదకి ఎక్కి ఆ ప్రకృతి మధ్య ఇద్దరూ ఎంజాయ్ చేశారు. ఉదయం లేచి ఇద్దరూ మళ్లీ ఫ్రష్ అయి ఇంకోవైపుకి వెళ్ళారు.
మళ్లీ సాయంత్రం అయ్యే సరికి అదే సమస్య. ఆ క్రింద దగ్గర లో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. వారి ఆశీస్సులు తీసుకోవాలని ఇద్దరికీ అనిపించి ఋషి దగ్గరకు వెళ్ళారు. స్వామీ, మాకు నాలుగు మంచి మాటలు చెప్పండి అన్నారు.
ఋషి వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి, క్రొత్త జీవితం లోకి వెళ్తున్నట్లున్నారు అన్నారు ఋషి. అవును స్వామీ అన్నారు ఇద్దరూ. ఆ పొదరిల్లు లాగానే సంసార జీవితం చాలా బాగుంటుంది. ఎక్కటానికి మీరు కష్టపడినట్లే ఆ సంసార జీవితాన్ని అధిగమించటం కూడా కష్టం.
అందులో వచ్చిన కష్ట సుఖాలను బాలన్స్ చేసుకుంటూ,ఇంట్లోని పెద్దలను ఆదరంగా చూస్తూ సంసార నావతో సముద్రాన్ని దాటండి. ఆయుష్మాన్ భవ అని దీవించి పంపారు. రెండవ రోజు కాటేజ్ లోకి వెళ్లిన తరువాత ఋషి మాటలు చెవులో రింగుమని, ఫ్యూ చర్ ప్లాన్ తో ఆలోచనలో పడ్డారు ఆ హానీమూన్ జంట.
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి