హృదయ చప్పుళ్ళు

హృదయ చప్పుళ్ళు

నీవెక్కడున్నావో
తెలియదే నాకు….!

ఇది ఖచ్చితం.
కొన్ని వేల మైళ్ల
దూరంలో ఏదో
ఒకచోట పెరుగుతున్నావు
అందాలను మూటగడుతూ,
నా కనులుగప్పి …………..!

నీ హృదయ చప్పుళ్లను
నేను వినగలను.
పెద్ద ధ్వనులతో
చేరునవి నన్ను.

నా రెక్కలు విప్పి
నీ హృదయ సవ్వడులకు
లయబద్ధంగా తాండవం
చేస్తాను…………!

ఎగిరెగిరి రావే.
బంధించు నన్ను
నీ ప్రేమ హస్తాలతో లేదా
అస్త్రాలతో బిగుతుగా ……………!

నా తాండవము
ఆగును కదనే
నువ్విట్లు చేసిన త్వరగా!

– వాసు

Related Posts