హృదయాలయం

హృదయాలయం

హృదయాలయం

మన హృదయం ఒక ఆలయం.
పవిత్ర ఆలోచనలకు నిలయం.
హృదయాన్ని గాయ పరచకు.
ప్రేమించే ఎదకు హానిచేయకు.
ఎదగాయం పైకి కనిపించదు.
స్నేహితుల ధైర్య వచనాలే
ఆ గాయాల్ని మాన్పగలవు.
మితృలతో బాధను పంచుకో.
వారికి ప్రేమను పంచి ఇవ్వు.
గాయపడిన వ్యక్తిని ప్రేమించు.
ప్రేమే గాయాన్ని మాన్పుతుంది.
ఎద గాయానికి మందు అదే.
అందుకే ప్రేమను అందించాలి.
ఇతరులతో బాధల్ని పంచుకోవాలి.

– వెంకట భానుప్రసాద్ చలసాని

తిరుమల గీతావళి Previous post తిరుమల గీతావళి
నా ధైర్యం Next post  నా ధైర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close