హృదయమా

హృదయమా

ఓ,
నా హిమ హృదయ మా,
నీ మాదిరే,
నా ప్రేమ స్వచ్ఛమైన
శ్వేత వర్ణము
తో కూడిన క్షీరము.
నాకు,
పట్టదులే నువ్వు
నన్ను అశ్రద్ధ చేసినను.
ఆది నన్ను మండించుతునే
ఉండును
నేను మరుగుతూనే ఉంటాను.
ఆది పెంచును
నా ఆయుష్షు.
నన్నిలానే వదిలేయ్.
సుఖముగా నుందు.
నీవు
నన్ను ఎట్లు చేరుదువో
అనే వేదన నాది.
తేనవైదువో, లవణమై
చేరుదువో……………!
వద్దు ప్రియా,
నాకీ వ్యధ.

– వాసు

Related Posts