ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా…

ఇంకా మిగిలే ఉన్నారు బానిస సంకెళ్లు గా…

న్యాయం లేని నీచమైన మనుషులు, ప్రేమ లేని బంధాల ముసుగులో పెళ్ళనే పవిత్ర బంధం అడ్డేసుకునున్న మృగాలు…. ఒళ్లు మరచి‌ మైకంలో, ఆడ ఊపిరి బిగబెట్టే పైశాచిక పురుగులు ఇంకా మిగిలే ఉన్నారు ఈ భూమ్మీద.. అతివ మనసు అర్థం చేసుకునేది ఎవరు..? ఆడ కన్నీరు తుడిచేదెవరు..? ఆడపిల్ల ఆశయాలను వ్యక్తిత్వాన్ని గుర్తించేదెవరు..? పాతికేళ్ల జీవితం వీడి డెబ్బై యైదేళ్ళ భవిష్యత్తులో భర్తే ప్రపంచంగా చేసుకుని పుట్టింటిని పరాయింటిగా, అత్తింటని సొంత ఇంటిని చేసుకుని అమ్మ నాన్న లను వీడి తెలియని ప్రపంచ లో అడుగు పెట్టి ఓర్పుగా అన్ని తానైయ్యది మగువ…

పుట్టిల్లు వీడటం ప్రతి అమ్మాయి కి శిక్షే… కానీ అత్తారిల్లు వరంగా మారడం అనేది అది భర్త పంచే ప్రేమ మీద ఉంటుంది.. కానీ ఇది ఎంతమందికి వరంగా ఉంటుంది నేటి సమాజంలో.. పెళ్ళంటే మూడు ముళ్ళు నాలుగు గోడలు వరకే పరిమితం చాలా వరకు.. ఆగోడల మధ్య జరిగే ఆడ మనసు వ్యధ తనను తాను ఓదార్చే ఆ కన్నీటిని తుడిచే తన చేతులకు మాత్రమే తెలుసేమో…..! ఆ నాలుగు గోడలకు గనుక నోరుంటే ఎన్ని కన్నీటి వ్యధలు మాట్లాడునో..

భార్యగా అవసరం భర్తకు , తల్లిగా అవసరం పిల్లలకు, కోడలిగా అవసరం అత్తమామలకు, వంశాన్ని మోసే పెంపుగా అవసరం ఆడపిల్ల… అతివ అంటే అవసరాల బంధమేనా… తనకంటూ ఈ జీవితంలో తనని తాను ఎక్కడ పారేసుకుంది. తనకంటూ ఓ జీవితం లేదా.. అన్ని త్యాగం చేసే మగువ మనసు, తన భావాౠ, తన ఇష్టాలూ, అర్థం చేసుకునేది ఎవరు.. శివుని అర్థాంగిక పూజింపబడిన …. నేటి సమాజంలో భర్తగా భార్యకు అర్థింగి స్థానం ఇచ్చేనా…

నాడు హరిశ్చంద్రుడు, పాండవులు భార్యను ఆస్తిగా భావించి తాకట్టు చేశారు.. నేడు ఆస్తి తెచ్చే అస్థిపంజరంగా పంజరానాలో బంధీఛేస్తున్నారు… భార్య అంటే ఆస్తి హక్కు అని ఎవరిచ్చారు..? ఆడదానికి గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదు..? ఈ సమాజంలో అమ్మాయిని బయటకు పంపించాలంటే భయం. దీనికి కారణం ఒక మగాడు ఇంకో మగాన్ని నమ్మలేక.. వారి అపనమ్మకాల వల్ల అమ్మాయికి అర్హతలున్న, సామర్థ్యం ఉన్న, సాధించే సత్తా ఉన్న గడపలోనే బంధేంచేస్తున్నారు….

కన్యాశుల్కం పోయి వరకట్నం ఆనే కాలంగా మారిన ఇక్కడ బలైయ్యది ఆడదే.. అతిప్రేమలు, అనుమానాలు, అసమర్థత ఆలోచనలుతో స్వేచ్ఛా లేని సంకెళ్లు వేసి ఎగమరమంటు ఎదగమంటుంది పురుష ప్రపంచం… మారాలి మగానూ, మొగుడిని, కొడుకుని అనే అహం ఆలోచనల… ఓ పురుషులారా మిమ్మల్ని మీరే నమ్మనీ ఈ సమాజంలో మీకు మీరే మారండి ఆడపిల్లలను బతికించండి.. ప్రతి గుమ్మం నుంచి ప్రతిభ ఉన్న స్త్రీ స్వేచ్చగా బయటికి వచ్చి గౌరవం పొందే రోజులు రావాలి…. ఇన్ని మోస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎప్పుడూ….

ఇది ప్రతి ఇంట్లో ఒక తల్లి, ఒక భార్య,ఒక ఆడపిల్ల ఎప్పుడో ఒకప్పుడు అనుభవించిన బాధలే.. ఇది సమాజంలో నేను చూసిన అతివల ఆర్తనాదాలు ఆధారంగా రాసినది….

– సీత మహాలక్ష్మి

Related Posts