ఇరు గమ్యాలు

ఇరు గమ్యాలు

నావల్లే పయనమగుట
నావల్లే కాదులే!

నీట తిరుగు నిరంతరము
కన్నీళ్ళే తెలియవులే!

ఇరు గమ్యాల మధ్య తిరుగు,
ఏ ఒడ్డూ తనది కాదులే!

అలలుంటే ఏంటైతే,
అలుపంటే ఎరగదులే!

పెరగదులే తరగదులే,
నొప్పసలే ఎరగదులే!

నావంటూ ఏమున్నవి,
నావంటూ పేరుతప్ప!

వానల్లో తడిసాక
నావల్లో తిరగాల!
నా వొళ్ళో తిరగాల!

– సత్యసాయి బృందావనం

Related Posts