ఇష్టమైన కవులు

ఇష్టమైన కవులు

ఇష్టమైన కవులు

ఇష్టమైన కవి అంటూ ఎవరూ లేరు కానీ కవులందరూ విభిన్నమైన రచనలు చేసిన వారే వారు చేసిన రచనలు అన్నీ దాదాపు చదివాను.ఇంకా చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి అని మొన్ననే తెలిసింది. నాకు తెలిసిన కవులే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని నేను ఒక అల్ప జీవిని అని తెలిసింది.

అలాగే ఒక్కో పుస్తకం అది నవల అయినా కథల పుస్తకం అయినా స్వాతి లాంటి వార పత్రిక అయినా ఒక్కొక్కరు ఒక్కో బిన్నమైన భాష వాడుతూ వర్ణిస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది నేనెందుకు ఇలా వర్ణించలేను అని, కానీ ఎవరి పంధా వారిది అన్నట్టు ,ఒకరు కొట్టి నట్టు రాస్తే, ఇంకొందరు అదే విషయాన్ని నవ్వెలా రాస్తారు.

ఇంకొందరు కవులు అని చెప్పుకుంటారు. కానీ కవులు కాకుండా అందరూ రాసినవన్ని గ్రహించి అందులో సగం ,ఇందులో సగం , మరి కొంత పైత్యం జోడించి రాస్తారు. ఇలాంటి వారంటే చిరాకు నాకు , మరి కొందరు రెండు పదాలలో మంచి అర్దం వచ్చేలా రాస్తే , మరి కొందరు నాలుగు లైన్ లు రాసి అదే రచన అంటారు.

అలాంటి రచనలు బోలెడు చదివి అసలు ఇలా ఎలా రాస్తారు అర్దం లేకుండా అని అనిపించింది. అసలు కథ కు టైటిల్ కు పోలిక లేనివి చాలా చదివాను. ఇలాంటి వారంటే వాంతి వస్తుంది.

కాబట్టి నాకు అంతగా ఎవరు నచ్చలేదు.మన పురాణాలు రాసిన వారు తప్ప, వారు కూడా కొంత ఊహ నే రాశారు తప్ప నిజాలు రాయలేదు అని నా అభిప్రాయం.

– భవ్య చారు

మనిషిని పోలిన మనుషులు Previous post మనిషిని పోలిన మనుషులు
సమాజం లో జరిగే అన్యాయాలు Next post సమాజం లో జరిగే అన్యాయాలు

One thought on “ఇష్టమైన కవులు

  1. మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *