జడివాన

జడివాన

మేఘాలు కమ్ముకుని
ముసుగు తీసిన వరుణుడు
వద్దన్నా గుమ్మరించును
జడివాన లా

విరామమెరుగక వర్షించును
వాగులు, వంకలు నిండగా

పుడమితల్లిపరవహించును జలసిరులతోసింగారంగా

ఋతువుల ఆగమనం తో
అదనుఅవుతుంది
జడివాన జాలులో

పాడిపంటలకుసారమై
ఊత మిస్తాయి పుడమికి

సూరీడు దాగిఉండును
మబ్బువెనుక
దారులన్నీ దర్శనమిస్తాయి
నీటితోనే

వస్తుందో లేదో అని ఎదురు
చూసిన వాన జడివానై
కురుస్తుంటే
వేడి వేడి కాఫీలు పకోడీలు
ఎదురొస్తే స్వర్గంమెట్టు
కనబడుతుంది ఎవ్వరికైనా…….?

– జి జయ

Related Posts