జగమంత కుటుంబం నాది

జగమంత కుటుంబం నాది

జగమంత కుటుంబం నాది

జీవితం లో ఆనందం ఒక బ్రహ్మ పదార్థం.ఆనందం లేక పోతే ఎన్ని భోగాలు ఉన్నా
కూడా నిరర్థకమే.

ఆనందం ఎక్కడో లేదు నీలోనే ఉంది అంటారు గురువులు. నిన్నటివి మరచి
రేపు గురించి ఆలోచించకవర్తమానం లో ఉన్నదే ,దానిని ప్రాప్తము అంటామేమో ,దానితో పాటు ఉంటే అదే ఆనందం.

కష్ట సుఖాలు కావడి కుండలు.వాటిని బ్రతికున్నంత కాలం మోయక తప్పదు.వాటిని అనుభవిస్తూనే జీవితాన్ని పరమేశ్వరార్పితం చేస్తే,కష్ట సుఖాలు సముద్రపు అలలు లా వచ్చి పోతూ ఉంటాయి.

గుండె లోతులలో ఉన్న బాధలను నూతిలో చేద వేసినట్లు చేదుకోకుండా ఉంటే ఆనందం మనతో పాటే ఉంటుంది.

రమణులునుఒక శిష్యుడు ఆనందం ఎక్కడ దొరుకుతుంది అని ఎన్ని సార్లో అడిగాడుట.అడిగినప్పుడల్లా ఊరకుండు అని చెప్పేవారుట రమణులు .

ఏదోచెప్పినాసందేహంతీరుస్తారనుకుంటేఇంతతేలికగాఊరుకోఅంటారేమిటి?అనిశిష్యుడు వాపోయాడుట.

అప్పుడు రమణులు ఆ శిష్యుని పిలిచి ,ఆప్యాయంగా అన్ని సమస్యలను కాలం పరిష్కారిస్తుంది. నువ్వు ఊరికే ఉండు అన్నారుట.

అప్పుడు శిష్యునికి రమణుల అంతరార్థంఅవగతమైంది.దీనినే పెద్దలు ఊరుకున్నంత ఉత్తమం లేదు,బోడి గుండంత సుఖం లేదు అని సింపుల్ గా చెప్పే శారు.

ఆ స్థితప్రజ్ఞత ను అలవాటు చేసుకుంటే,ఆనందం మనతో పాటే ఉంటుంది కదండీ.

దీనినే భగవద్గీత లో పరమాత్మ కర్తృత్వ,భోత్రృత్వములను నామీద వేసి ప్రతిఫలాపేక్షలేకుండా కర్మలను చేసినవారికి నేనుసాయపడతాను అని చెప్పారు కదా.

మన మనసు పొరల మాటున ఉన్న ఆనంద సముద్రాన్ని వెలికి తీసి, విశ్వవ్యాప్తం చేస్తే ,సిరివెన్నెల గారు చెప్పినట్లు జగమంత కుటుంబం నాది అవుతుంది కదా ఫ్రెండ్స్.

నాకు వేదాంతం తెలియదండీ.ఏదో మిడిమిడి జ్ఞానంతో మాత్రమే వ్రాశా.అంగీకరిస్తారా?
మీ అమూల్య సమీక్షల్లో తెలుపండి.

రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

గోవిందో జన్మ Previous post గోవిందో జన్మ
వానకారుకోయిల Next post వానకారుకోయిల

One thought on “జగమంత కుటుంబం నాది

  1. మీరు తెలిసినంతలో చాలా గొప్పగా చెప్పారు..🙏🙏💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close