జగమే మాయ!!

జగమే మాయ!!

నిరంతరం లోతు పరిధి పెరుగుతూ, మనిషి జీవితంలో లోతైన తన పాత్ర వహించేదే ఈ మాయ. మాయ లో మొదటి అక్షరం ‘మా’ అంటే మానవుడు అండి. రెండవ అక్షరం ‘య’ అంటే యత్నాలు. కాబట్టి మానవుడి ప్రయత్నాలు మాయలో భాగమే.

తల్లి గర్భం నుంచి శిశువు ను మాయ నుంచి వేరు చేస్తారు.. అంటే మానవ జీవితం మాయ నుంచే ప్రారంభం. మరి మనతో ఇంత గట్టి బంధం ఉన్న మాయని వ్యతిరేక పదం అనగలమా? అనుకూల అర్థాన్ని ఇచ్చే పదం అనగలమా?

తల్లి పనిలో ఉన్నప్పుడు పసిబిడ్డ గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఇంట్లో పెద్దావిడ ఆ పాప నోట్లో తిత్తి పెట్టేస్తుంది. బిడ్డ వెంటనే ఏడుపు ఆపేస్తుంది. ఇలా తిత్తి తో పాప ని మనం మాయ చేస్తాం.

చందమామ రావే జాబిల్లి రావే అంటూ చందమామను పిలుస్తూ పాపకు అన్నం తినిపిస్తాము. ఆ పాప చంద్రుణ్ణి పిలుస్తే వస్తాడేమో అని ఆయన వంక పైకి చూస్తూ ఉంటుంది. ఇది ఇంకో మాయ.

ఈ మాయ గొప్ప వినోద వస్తువు కూడా అండి. గారడీ వాడు వస్తువులను మాయం చేసి వృద్ధులను సైతం బురిడీ కొట్టిస్తాడు.

ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ మధ్య జంతువులను కూడా మాయలో పెట్టడం చూస్తున్నాం. ఓ, కుక్క యజమాని తనకి, ఆ కుక్కకి మధ్య ఒక దుప్పటిని అడ్డు పెడతాడు.

కాసేపు మాత్రం ఆ దుప్పట్లో ఉన్నట్టు నటించి తర్వాత దుప్పటి పడేసి పక్క రూం లోకి పరిగెడతాడు. పాపం, ఆ పిచ్చి కుక్క తన యజమాని కోసం దిక్కులు చూస్తూ వెతుక్కుంటూ ఉంటుంది.

ఇక స్కూళ్ల యాజమాన్యాలు సంగతి చెప్పనే అక్కర్లేదు. అడ్మిషన్స్ కోసం వీరు పోషకుల ఎన్నో మాయ మాటలు చెబుతారు. ఈ సంగతి తెలిసి కూడా తల్లిదండ్రులు పిల్లవాడిని చేర్పించే చేసి హాయిగా తృప్తిగా ఊపిరి పీల్చుకుని చేతులు దులుపు కుంటారు.

ఆసుపత్రులు గొప్ప మాయాబజార్ లండి. మనతో కొండను తవ్వించి ఎలుకను పట్టిస్తారు. చివరికి, ‘ ఆ మీ రోగం మాకు తెలుసు ముందే…. కానీ డయాగ్నసిస్ చేయాలిగా. ఇలా చెబుతూ ఓ లక్ష రూపాయల బిల్లు చేతిలో పెడతారు.

ఇక రాజకీయాలు. ఇదో మాయావిశ్వం అండి. ఎన్నికల ముందు వీరు ఇచ్చే మాటలు వాగ్దానాలు మాయలో భాగమే. పేదవారికి ఇల్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదా వారికి భృతి ఇత్యాది వన్నీ వాళ్ళు మనకి ఇచ్చే సెడేషన్స్ .

ఇక చివరిగా తాగుబోతుల దగ్గరికి వద్దాం…..! వీడు తన బాధలన్నీ మర్చిపోవడానికి తాగుతున్న అని చెప్తూ మనందరి మాయ చేస్తాడు. ఇదీ సంగతి, మరి ఈ మాయలో నుంచి మనమందరం బయటపడదామా? వద్దులేండి మన మానవ యత్నాలు (మాయలు) ఆ పద్దు లేండి.

– వాసు

Related Posts