జై! బోలో! గణేష్ మహరాజ్ కీ జై!

జై! బోలో! గణేష్ మహరాజ్ కీ జై!

నలుగు పిండి శరీరముతో

వెలుగు నీయగ వచ్చితివయ్య

కలుగుచుండును శుభములు మాకు

మెలుగు తుందుము భక్తితొ మేము

అమ్మవారు నీకు శరీర మిచ్చె

తలను యిచ్చెను అయ్యగారు

గజాసురుని తల అయ్యెను నీకు

వాహనమేమొ మూషికాషురుడు

విశాలమైన చెవులతొ నీవు

విందువు మావిన్నపములన్నీ

కలలలన్నిటిని సార్ధకం చేస్తూ

ఆశలలన్ని నెరవేరుస్తావు

నిలకడగ వుండ లేని మేము

నీ నీడ కొరకై వచ్చి చేరితిమి

కడ తేర్చగ వేగిర మొచ్చి

నీ కడ చేర్చుకొనవయ్యా!

పంచభూతములు నీ పంచనుచేరగ

గ్రహములు కదలును

నీ అనుగ్రహమున ఉండ్రాళ్ళవలె

వినువీధిలోన

అర్ధనారీశ్వరుని ముమ్మార్లు చుట్టి

అన్నపైన నే మిన్నగనిలిచి

గణాధిపత్యం పొందగ నీవు

గణేష్ మహరాజ్ అయ్యావు

జై!బోలో! గణేష్ మహరాజ్ కీ జై!

 

– రమణ బొమ్మకంటి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *