జై జావాన్

జై జావాన్

ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో
నీ చేయి పట్టుకుని నీతో ఏడడుగులు వేసి
నీ ఇంట్లో అడుగు పెట్టాను..

అనుకోలేదు ఏనాడు ఇంత మంచి మనసు కల వాడు నాజీవితం లోకి వస్తాడు అని..
నాతో నా చేయి పట్టుకుని నడిపించేవాడు అవుతాడని..

ఎంతో ఎదురు చూసాను.. నీ లాంటి ఒక మంచి తోడు నాకు రావాలని..

కానీ ఇంటిని ఆలిని వదిలి..
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. దేశ రక్షణే.. నీ ధ్యేయంగా..

దేశ గౌరవమే నీ లక్ష్యంగా… దేశం కోసం మాకు ఎక్కడో దూరంగా నీ ప్రాణాలు పణంగా పెట్టీ బతుకు తున్నావు . 

నువ్వు క్షేమంగా ఇల్లు చేరాలని
నీ కోసం ప్రాణాలు అరచేతిలో
పెట్టుకుని నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్య…

దేశం కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఇల్లు ఆలి పిల్లలు అని లెక్క చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ప్రతి జవాన్ కి నా పాదాభివందనాలు.. జై జావాన్

– వనీత రెడ్డి

Related Posts