జై కిసాన్

జై కిసాన్

జై కిసాన్

పంట వేసే రైతుకు ఎంత కష్టం ఎంత కష్టం
నకిలీ విత్తనాలు ఇచ్చి ఒకరు
పురుగుల మందులు నకిలీవి ఇచ్చి మరొకరు
పంటకు తగిన ధర ఇవ్వక దళారుల మధ్య నలిగిపోతున్న రైతుకు ఎంత నష్టం ఎంత నష్టం

ఈ నష్టంలో ఆ వానదేవుడు కూడా రైతుకు అన్యాయం చేస్తున్నాడు. తన వంతు బాధ్యత తాను తీర్చుకుంటూ ఆన్యాయమే చేస్తున్నాడు. మంచి పంట ఎప్పుడు వచ్చిననా ఆ సమయంలో వాన పడి రైతు ఇల్లు గుల్ల అవుతుంది.

ఓవైపు ఎదిగి వచ్చిన పిల్లలు మరోవైపు చేతికి అందాల్సిన పంట మరోవైపు షావుకారు దగ్గర తెచ్చిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక నెత్తికి చేతులు పెడుతూ దిగాలుగా ఉన్న రైతుకు దినమంతా కన్నీరే…

రైతును దేవుడు ఇలా చూడాల్సిన ప్రజలే వారికి అన్యాయం చేస్తూ నాయకులు బ్రోకర్లు మధ్యవర్తుల మధ్య కమిషన్లకు కూడా అంటూ నలిగిపోతూ నాశనం అయ్యేది ఒక్క పేద రైతు మాత్రమే.

మిగిలినవారు ఎంత సతాయించినా ఎన్ని మాటలు అన్నా, పంట దిగుబడి ధర రాకపోయినా రైతు మాత్రం తను నమ్ముకున్న నేల ను మర్చిపోరు. భూమాతను నమ్ముకున్న నాకు బరువేల అనుకుంటూ, భరించేంతవరకు భరిస్తూ ఇక భరించలేని సమయంలో నేను నీ దగ్గరికి వస్తున్నా తల్లి అంటూ ఆ భూమి మీదనే కలిసిపోతాడు అశువులు బాస్తాడు.

ఇన్నాళ్లు కలకంట కన్నీరు ఒలికితే అనుకున్నాం, కానీ ఇప్పుడు రైతు కంట కన్నీరు ఒలికితే, రైతే పంటను పండించకుండా భూమిని అమ్ముకుంటే రైతే వ్యవసాయం
వదిలేసి వ్యాపారం లోకి దిగితే, భవిష్యత్తు లో అన్నమన్నది దొరుకుతుందా, భూమన్నది కనిపిస్తుందా, అసలు భవిష్యత్తు అనేది ఉంటుందా, అందుకే అందరం కలిసి మనల్ని మనం కాపాడుకుందాం మనమంటే రైతులం, మనం వచ్చింది ఉన్నది నేల పైనే కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనమే రైతుల వద్దకు వెళ్ళి పంటలు కొనాలి.

దళారుల చేతిలో రైతు బాధ పడకుండా మనమే ముందుగా పూనుకోవాలి. జై జవాన్, జై కిసాన్ అంటూ రైతు కంట కన్నీరును మనమే తుడవాలి. మనమే మన రైతులను ఆదుకోవాలి.

– భవ్య చారు

నీరు కారిన రైతు గుండె Previous post నీరు కారిన రైతు గుండె
నీరు కారిన రైతుగుండె Next post నీరు కారిన రైతుగుండె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *