జలం
జలం కోసం అల్లాడి పోతున్న జనం
భూమి మీద జీవాల గొంతులు ఎండిపోతున్న వేళ
ఈ జనాల జలాల బాధలు తీర్చే భగీరథ వచ్చేనా
జలం లేక జనాలు చస్తూ బ్రతుకుతున్నా
జలం కదా మన బలం
జలం లేనిదే జీవం లేదు
ఆదా చేస్తే ఆసరాగా మిగిలేది ఒక జలం మాత్రమే
వృథా చేస్తే మన కంట్లో కన్నీరే మిగులుతుంది
జలం పొదుపు చెయ్యి జగతికి మేలు జరుగుతుంది
ఒక జలం చుక్క ఒడిసి పడితే ఒదిగిపోతావు
విడిచి పెట్టితే వినాశనమే మిగులుతుంది
జలం ఉంటే ఏదైనా సజీవం
లేదంటే ప్రపంచం మొత్తం నిర్జీవంగా మారుతుంది
చుట్టూ సముద్రాలు ఉన్న గుక్కెడు మంచి జలం కోసం
అల్లాడే పరిస్థితి మనది…
ఆవిరి అవుతుంది జలం
ఉద్యమించాలి మనం
కొత్త జలం జాడ లేక
ఉన్న జలం కానరాక
ఎండలు ఇలా మందుతుంటే
నేల తల్లి గుండె పగిలిపోదా
తరుగుతోంది జలనిధి
పెంచడం మన విధి…
-మాధవి కాళ్ల