జన్మలేలేని లోకంలో

జన్మలేలేని లోకంలో

అరమరికలెరుగని తీరంలో..
ఆలుమగలైన లోకంలో..
ఒకరికొకరని ఒదిగిపోయాము..
జన్మజన్మల బంధమై పెనవేసుకున్నాము…

గతజన్మ వాసనే నేటికీ ఉందంటూ…
జన్మలెన్నైనా నాతోడు నీవంటూ
బతకాలనుంది …
జన్మజన్మల సహవాసమంతా
జన్మలే లేని లోకాన విహరించాలని…
కలిమిలేముల కష్టసుఖాల అగచాట్ల ఆలంబనల్లో…
కలసిమెలసి సాగిపోవాలని ఉంది…

అల్లరిచేసి ఆటపట్టించే నీ చిలిపితనంలో…
బుంగమూతుల ముద్దుముచ్చట్ల పరవశంలో…
నినువీడక కాలమంతా గడిపేయాలని ఆకాంక్ష…
అలకల చెలియకి కోకచుట్టి…
బుంగమూతుల పెదాలని సుతారంగా ముద్దాడాలని కాంక్ష…
కసిరే కనులకి కాటుకలా అల్లుకుని…
అందంగా ఆ ముక్కెరనై నాసిక అంచున మెరవాలని
కలలెన్నో కంటున్నా…
నా దరిచేరి నిజం చేయవే జవరాలా…
జాలిచూపి దరి చేరి జీవించవే సఖియా…
ప్రేమని తెలిసుకుని నీలోదాగిన నను చేరవే ప్రియురాలా…
నా ఆశల ఆకాంక్షల కానుకవై దరిచేరవే కోమలాంగీ…

– ఉమా మహేశ్వరి

Related Posts