జత

జత

జత కలిసింది అంటే
జరిగిన వింత కథ మరి

నింగి నేల కలిపితే అది
ఒక భూ మండలం

ప్రకృతి వికృతి కలిస్తే అది
ఒక చూసే ప్రపంచం

సూర్య చంద్రులు కలిస్తే అది
ఒక కాంతుల దేదీప్య మే

శరీరం మనస్సు కలిస్తే అది
ఒక విలువైన ప్రాణం

నిజం అబద్దం అనేవి
అంత రంగాల అనుభవాలు

కష్టం సుఖం కలిస్తే అది
ఒక జీవన సమాహారం

తప్పు ఒప్పు కలిస్తే అది
ఒక అనుభవాల తంత్రం

తోడు నీడ బంధం అది
దైవం ప్రసా దిస్తే అత్యున్నత
అభయ హస్తం

– జి.జయ

Related Posts