జాతి గుండెల్లో పింగళి వెంకయ్య

జాతి గుండెల్లో పింగళి వెంకయ్య

జాతి గుండెలో త్రివర్ణమై ఎగురుతూ
తెలుగువాడిగా ఖ్యాతిని పొందుతూ
స్వాతంత్ర్య సమరం లో జెండాగా వెలుగొంది
దేశభక్తికి నిలువెత్తు రూపముగా నిలిచే…

జాతి చేతికి ఘనమైన పతాకం
ప్రతి హృదయములో ఎగురుతుంది ప్రతి క్షణం
మూడు రంగుల ముచ్చట గొలుపుతూ
నింగిలో రెపరెపలాడుతుంది అనుక్షణం..

పింగళి వెంకయ్య మదిలో మెదిలిన రూపం
యావత్ జాతి చేతిలో మెరిసిన కంకణం
గుండె నిండా ధైర్యము నింపే జెండా
చిరునవ్వులతో విశ్వంలో ఎగురుతుంది నిత్యం…

భారతీయుడికి చిహ్నంగా నిలిచింది
ప్రపంచ వేదికలో చిరునామాగా తిరుగుతుంది
స్వాతంత్ర్యానికి గుర్తుగా సగర్వంగా నవ్వుతూ
చేతి పిడికిలి కర్రలో మువ్వర్ణమై తిరుగుతుంది….

జాతి మరిచిపోతున్న మహానేత ఇతను
గుర్తించనటువంటి ప్రభుత్వాలు నేడు ఎన్నో
స్మరించ నటువంటి జాతి ద్రోహులు ఎందరో
నిజంగా ఇది భారతీయుడికి అవమానమే…

జెండాకిచ్చే గౌరవం రూపశిల్పిని లేదా
ఒక ఆకారాన్ని సృష్టించిన వీరుని మర్చిపోతే ఎలా
జాతి మనుగడలో ఆణిముత్యం అతను
స్వాతంత్ర్య సమరంలో అసామాన్య విజేత ఇతను..

జోహార్లు జోహార్లు పింగళి వెంకయ్య
క్షమించు ఈ జాతి నిన్ను మరిచినందుకు
నీ రూపాన్ని త్రివర్ణ పతాకం లో చూసుకుంటూ మురిసిపోతాం
జాతి మొత్తము రుణపడి ఉంది నీ త్యాగానికి..

 

-గురువర్థన్ రెడ్డి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *