జీవనం సాగిస్తున్నాను
ఇద్దరు పిల్లలు తర్వాత
నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు..
నేను చాలా కష్టపడి పిల్లల్ని ఇద్దరిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాను..
వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత
నా స్థాయికి తగ్గట్టు ఘనంగా పెళ్లి చేశాను..
కొన్ని రోజులు ఊరు వెళ్తున్నామని అబద్ధం చెప్పి నన్ను అనాధాశ్రమంలో వదిలి వెళ్లారు…
నేను వాళ్ల కోసం ఎదురు చూసిన రోజే లేదు
నా కొడుకు కోడలు వచ్చి నన్ను తీసుకెళ్తారు అని అపనమ్మకంతో ఉండేదాన్ని…
కొన్ని రోజుల తర్వాత అగ్ని ప్రమాదంలో వృద్ధాశ్రమం కాళీ బూడిదయ్యింది…
అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోయారు…
నేను ఒంటరిగా మిగిలిపోయాను..
నాకు తెలిసిన చేతివృత్తితో చాపలు బుట్టలు అల్లడం చేసి అమ్ముకునేదాన్ని…
నా భర్త చనిపోయినప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా బతికాను..
ఇప్పుడు నా మరణం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ నా జీవనం సాగిస్తున్నాను…
ఎప్పటికైనా నేను ఒంటరిగా మిగిలిపోతాను అనుకోలేదు..
నాకు నా పిల్లలు తోడుగా ఉంటారు అనుకున్నా సమయంలో వాళ్లే నన్ను ఒంటరిని చేసి వదిలి వెళ్ళిపోయారు..
– మాధవి కాళ్ల