జీవితం

జీవితం

చిదాకాశం నీడలో
చిరునవ్వుల గొడుగుతో
అనుభవాల బాటలో
పున్నమి చంద్రుడిలా
సాగిపోవటమే జీవితం

ఎదురుదెబ్బలు
ఆటుపోట్లు
లోటుపాట్లు
పలకరింపుల పన్నీరు
అన్నీ చూడాల్సిందే
మోదఖేదాలను మోయటమే జీవితం

కాలం యవనికపై
ఎవరి పాత్రను వారు పోషించాల్సిందే
కుప్పలు తెప్పలుగా
పొట్టతిప్పలు
మనసు దొన్నెలో జ్ఞాపకాలు
కలిపితేనే
తేనె మాధుర్యమై జీవితం

అతిథవోలె అవనికి
వచ్చినవారం
వారాలు, నెలలు కరిగిపోతుంటే
కొట్లాటలను కొట్టేసి
మాటల కెరటాలుగ మారమనేదే జీవితం

– సి. యస్ .రాంబాబు

Related Posts