జోక్ – దోమ – లీగల్ పాయింట్

జోక్ – దోమ – లీగల్ పాయింట్

 

మొదటి దోమ: ఈ భూమిమీద పుట్టిన ప్రతీ జీవికి బ్రతికే హక్కుంది గదా!

రెండవదోమ: అవును.

మొదటి దోమ: మరి మనకెందుకు లేదు! గుడ్డుకూడా వుండకూడదని నాశనంచేయటానికి పరిశోధనలు చేస్తున్నారు!

రెండవడోమ: మనం వీళ్ళని పీక్కుతింటాం అందుకని.

మొదటి దోమ: మరి మేన్ ఈటర్స్ అయిన సింహాలు, పులులు ఇవి కూడా పీక్కు తింటాయి గదా మరి అవి హాయిగా బ్రతకటానికి అడవులకు అడవులే వదిలేస్తున్నారు!

రెండవదోమ: ఏమో! నాకు తెలియదు.

– రమణ బొమ్మకంటి

Related Posts