కాడి ఎద్దులు

కాడి ఎద్దులు

ఊరికి చివరన చిన్నపాక, పిల్లలంతా కేరింతలతో
ఆడుకుంటున్నారు తనతోటివారు, పెద్దవారు చింతచెట్టు
అరుగుమీద కూర్చున్నారు.
ఆ శబ్దాలు అతనికి  విసుగుపుట్టిస్తున్నాయి.
అయినా తనకు కుడివైపున కొద్దిగ
దూరంలో ఏవో పెద్దగా అరుపులు అవి
అతనికి పరిపరి విధాల ఆలోచనలను
రేకెత్తిస్తున్నాయి. చుట్టుపక్కలందరిని
అడిగినా ఎవరు పలకడంలేదు.
చేతిలో రుమాలు తీసుకుని గడపదాటి
అడుగుముందుకేసి రుమాలు తలకు
చుట్టి, కిర్రుచెప్పులేసుకుని అరుపులు
వినబడుతున్న వైపు పోతున్నాడు. ఎప్పుడు
చూడని వ్యక్తిలా వింతగా చూస్తూ వెంట వెళ్తున్నారు అరుగుమీద ఉన్నవారంతా.
అతను వెళ్ళేసరికి కాడిఎద్దులు కాలువ
నీటిలో ఇరుక్కునుంటాయి.
ఎదో మూలనుండి అదేపనిగా అన్నట్టు

“చేతగాకపోయినా సూడనికి వచ్చినాడు”అని అంటాడు.
ఏదీ పట్టనట్టుగా కాలువలోకి దిగి
పొలుగు సరిచేసి వాటితో ఎదో మాట్లడి
నట్లుగా వెళ్లి చెక్కబండి మీద కూర్చున్నాడు
దిక్కులుపిక్కటిల్లేలా రంకెలేసుకుని,
చూసేవారు నివ్వెరపోయేలా, కాలువగట్టు
నుండి బయటికి వచ్చేస్తాయి.

మరోపక్క నుంచి “పులిని బంధించినంత మాత్రాన స్వభావం మారదు కదా!”అంటూ,
ఇంటికి వచ్చినపుడు కొడుకు తల్లిని
అడుగుతాడు ఎవరమ్మా అతను అంత ధైర్యంగా సహాయం చేశాడు అని
అతను గొప్ప రైతు ఆ ఎద్దులు అతనివే
మనకి అరువు ఇచ్చినాడు అంతే.
ఎందుకమ్మా
రెడ్డిగారి పొలానికి పోవాలంటే ఇతని పొలం నుండే పోయ్యేవారు
దానికి విసుగుచెందిన రెడ్డి ఆ పొలాన్ని
కబ్జా చేసే క్రమంలో అతను కొడుకును,
ఆలిని పోగొట్టుకుంటాడు అప్పటి నుండి
అతను పాక నుండి బయటకు రాలే
తన కాడిఎద్దులు కష్టం చూసే వచ్చినాడేమో.

– హనుమంత

Related Posts