కాలం కాళీ స్వరూపం…!!!

కాలం కాళీ స్వరూపం…!!!

గమనమెంతో మేల్కొలుపు
జీవిత మెంతటి పోకడలను కదలించినా
వాలే పొద్దులతో దాటని హద్దుగా
ఒలుకుల మిట్ట వరకేనని…!!
ఒక్కటిగా వచ్చిన ప్రయాణాన్ని
ఒక్కడిగానే సాగనంపుతు
కాలం దాయని ధర్మాలతో ప్రతి మనిషికి
నేలన జరిగే అంతిమయాత్ర…

వేయి మెదళ్ళలను చిలికిన
మధునంతో తెలుసుకో…
చావు పుట్టుకలు కాలంతో నడిచే
నిత్య మార్పులే…అన్ని స్వభావాలు
తెలిసిన కాలం కాళీ స్వరూపం…!!
ఆకలని అడగదు అలుపని నిలువదు
నీలో నిదురించే ప్రయత్నం చలనమై…
ఒకనాటికి మరణమైనా తన ఒడిలో
చేర్చుకొనే కాలం స్తబ్ధత నే…

పెంచుకొన్న ప్రేమాప్యాయతలు
పెలుసులుగా విరిగిపోతు…!!
నిండిన మమతలు నిలువునా
కూలుతు బదులురాని బంధాలు
కళ్ళముందే తెగుతు పూచిన స్నేహాలు
ఎడారి రోధనలై ఆశలు ఎదన కుంపటై…
తోడురాని మనుషులతో నీవెంతటి
సామ్రాజ్యాన్ని సాధించుకొన్న జరిగే
సంగ్రామంలో నీదొక పాత్రనే…

నడిచిన ఆ నలుగురు నీకు
నియామకులు కాదు వారి పాత్రలలో
ఒదిగిన నటులే… కనికరమంటు
చూపదు నీవు చేసిన కర్మల ఫలితాలకు
సాక్ష్యంగా నిలువాలనుకోదు…!!
ఆజ్యమైపోతున్న అర్పితాలతో
తడారిపోతున్న తర్పణాలతో తరిగిన
బతుకుల చివరి పిలుపును దింపుడు
గల్లాన పలకరిస్తూ ఎదురు చూడని
కాల స్వరూపం ఆగదు.

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *