"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

కాలం నేర్పిన పాఠం

కాలం నేర్పిన పాఠం

పిల్లాడు బాగున్నాడు ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఎనిమిదో తరగతిలోనే పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు ఎంతో కూడా నాకు గుర్తులేదు. పెళ్లయ్యాక మామూలే అత్తారింట్లో అత్త, నలుగురు ఆడపడుచులు, నలుగురు మరుదులు ఇదే మామూలే. వండడం, వార్చడం, పెట్టడం, మళ్ళీ కడగడం, వండడం, వార్చడం, ఇదే జరిగింది.

దాంతో పాటు ముగ్గురు పిల్లలు కూడా పుట్టుకొచ్చారు. ఉద్యోగరీత్యాచాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. మా అత్తగారు మిగిలిన వారు ఎవరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఉన్న పనిమనిషి పోతుంది అనే బాధ తప్ప వాళ్ళకి నా మీద ప్రేమ, అభిమానాలు ఏమీ లేవు కాబట్టి.. అయినా పిల్లల చదువులు కాబట్టి 20 ఏళ్ల తర్వాత ఆ ఇంటి బయట అడుగుపెట్టాను.

పెట్టింది మళ్ళీ వెనక్కి తీసుకోలేదు. ప్రతి పండక్కి వచ్చిన ఆ పండగ అయిపోయేంతవరకు ఉండడం ఆ తర్వాత వెళ్లిపోవడం జరిగేది పండగ ముందు పది రోజులు వచ్చి పండగ అయిపోయినాక పది రోజుల తర్వాత వెళ్లడం ఆ పండగ చేసే వారిని నేనే చేయాలి. చేసేవి నా నోట్లోకి నా పిల్లల నోట్లోకి వెళ్లిన గుర్తు కూడా నాకు లేదు చేసినవి చేసినట్టు ఆడపడుచులు ఎత్తుకెళ్లడం, నాకు లేకుండా చేయడం మామూలే.

అయినా తట్టుకున్నాను. ఇక్కడ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాను అని తప్ప ఇక్కడ కూడా తన్నులు గుద్దులు తప్పలేదు. అయినా ఓర్చుకున్నాను పిల్లల కోసం తల్లిదండ్రులకు చెప్తే సర్దుకు పొమ్మన్నారు తప్ప సర్దుకుని రమ్మని చెప్పలేదు. కాబట్టి ఇక వాళ్ళు ఏం చేయలేరని అన్నిటికీ నోరు మూసుకొని పిల్లలను చూస్తూ వాళ్లకోసం నా బ్రతుకును నా కలల్ని త్యాగం చేశాను.

నాకు చిన్నప్పుడు సినిమా యాక్టర్ కావాలనే ఉండేది ఆ తర్వాత డాక్టర్ కావాలని అనుకున్నాను కానీ అవేమీ జరగలేదు కనీసం నా పిల్లల్ని అయినా అలా చూడాలి అని ఆయనతో గొడవ పెట్టుకుని పిల్లల్ని అయితే చదివించాను కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని పిల్లలు కూడా అంతంత మాత్రమే.. కాకి కడుపున కోకిల పుడుతుందా ఇది ఆ వంశవృక్షమే కదా కాబట్టి పిల్లలు మామూలు చదువుతో చదువుకున్నాం అని అనిపించారు. పిల్ల పదవ తరగతి పాస్ అవగానే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశాడు వద్దన్నా వినకుండా, వాడు పరమ తాగుబోతు, దొంగ అన్ని అలవాట్లు ఉన్నాయని తెలిసినా నేనేం చేయలేక ఒంటరి దానిలా మిగిలిపోయాను.

పిల్లకు పెళ్లి చేసి పంపించాక కానీ ఆయనకు అల్లుడి నిజ స్వరూపం తెలియలేదు. తెలిసినా చేసేదేం లేక నోరు మూసుకొని అడిగిందల్లా ఇచ్చాడు. చెప్పినంత చేసాడు కానీ ఎన్ని చేసినా ఎన్ని విధాల వాడిని సంతోషపరచాలని ప్రయత్నించినా వాడి శాడిజానికి నాకు కడుపుకోతే మిగిల్చాడు. నా ఒక్కగానొక్క కూతుర్ని హింసించి చంపాడు. దాన్ని ఒక ప్రమాదంలా చిత్రీకరించి మమ్మల్ని నిజం తెలిసినా కూడా మేము ఏమి చేయలేదు. నేను కేసు పెడదామని అన్నా కూడా అక్క కాబట్టి ప్రేమతో ఏమి చేయలేక నోరు మూసుకున్నాం. కాదు ఆయనే నా నోరు నోక్కేసాడు.

పెళ్లి కానప్పుడు సినిమాలలో చూసి పెళ్లంటే ఇలాగే ఉంటుందేమో ఇంత బాగా జరుగుతుందేమో అత్తమామలు తల్లిదండ్రుల్లా ప్రేమగా చూసుకుంటారేమో ఆడపడుచులు ఆటపట్టిస్తారేమో అని అనుకున్న నాకు ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క పాఠం నేర్పింది. ఇప్పుడు కూడా కూతురు మరణంతో జీవితం అంటే ఇదే అని అనుభవం పాఠం అయ్యింది.

ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయన తాగడం ఆయన్ని బలి తీసుకుంది. నా పుట్టింటి వాళ్లు నా విషయాలన్నీ తెలిసి ఆయన పోయాక వచ్చి, పోతే పోయాడు నీకు దెబ్బలు తప్పాయి అని అన్నారు. నిజమే కాబోలు అని అనుకుంటూ నా వారు నాకు అండగా ఉంటారని అనుకున్నాను వారిని ఎంతో నమ్మాను కానీ నా నమ్మకాన్ని అబద్దం చేస్తూ చేస్తూ ఆయన చనిపోయాక వచ్చిన డబ్బులన్నీ అయిపోయే వరకు నాతో ఉండి ఆ తర్వాత నా దగ్గర ఏమీ లేదని తెలిసి మొహం చాటేయడంతో ఇది కూడా ఒక జీవిత పాఠం లాగా నేర్చుకున్నాను.

ఆ తర్వాత పిల్లలతో కలిసి వేరే ఊరొచ్చి బ్రతకడం మొదలుపెట్టాను. అందరి విషయం తెలిసింది కాబట్టి అందరిని దూరంగా ఉంచాను. దాంతో అండగా ఉంటారు అని అనుకున్న నా వాళ్ళు నన్ను వెలివేసినంత పని చేశారు. అయినా నేనేం వాళ్ళని బ్రతిమాలలేదు. ఎందుకంటే ఇప్పుడు జీవితం అంటే ఏంటో నాకు తెలిసింది ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క పాఠాన్ని నాకు నేర్పుతూ వచ్చింది.

మనిషి తన జీవితంలో ఎన్నో కలలు కంటాడు కానీ అవన్నీ నిజం కావు. మన ఊహల మేడలో మనం ఎన్నో ఊహించుకుంటాం కానీ అవన్నీ పీకమెడల్లా మన కళ్ళముందే కూలిపోతూ ఉంటే అప్పుడు నిజమైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.

ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అయినా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే వాళ్లకి జీవితం అంటే తెలియదు అప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్లకి నేను అన్ని విధాలా చెప్తూ ఉంటాను కానీ పిల్లలు కదా వింటారా వినరు. అందుకే నేను చెప్పడం మానేశాను. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది అదే అందరికీ అన్నీ నేర్పిస్తుంది.

ఇప్పుడు నాకు నేర్పించింది ఒక్కటే. నమ్మాల్సిన వాళ్లని నమ్మాలి. నమ్మలేని వారిని నమ్మకూడదు. ఇప్పటికీ నేను ఎవరిని నమ్మను నా నీడను కూడా ఎందుకంటే నీడ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మనల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. అలాగే అద్దం కూడా అద్దంలో ఒకలాగా బయట ఒకలాగా కనిపిస్తాం. ఇవన్నీ నేను నా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న పాఠాలు అంటే కాలంతోపాటు నేను నేర్చుకున్న పాఠాలు ఇవే నిజ జీవిత సత్యాలు….

కంటికి కనిపించేదంతా నిజం కాదు అలాగే కంటికి కనిపించనిది నిజం కాదు. చెప్పుడు మాటలు, మేము అండగా ఉంటాం అనే వారి మాటలు అస్సలు నమ్మకూడదు. అంటే మనిషిని మరో మనిషే నమ్మకపోతే ఎలా అని అంటారేమో నిజమే నమ్మాలి తప్పదు కొన్ని సార్లు బోల్తా పడినా మరికొన్ని సార్లు పైకి లేచేలా ఉండాలి.

నా వాళ్ళు నన్ను మోసం చేసినా కూడా నేను మళ్ళీ లేచి నిలబడగలిగాను అంటే అది నాలోన ఉన్న ధైర్యమే కారణమని నేను ధైర్యంగా నిజాయితీగా చెప్పుకోగలను. కాలం చాలా విలువైంది దాన్ని ఎప్పుడూ దుర్వినియోగపరచవద్దని నా ఈ యాభై ఏళ్ల జీవితంలో నేను తెలుసుకున్న, జగమెరిగిన సత్యం.

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *