కారణాలెన్నైనా కావచ్చు…!!!

కారణాలెన్నైనా కావచ్చు…!!!

కుడిఎడమై
ఓడిపోయినా పరువాలేదు
ఏదో ఒకనాటికి గెలువొచ్చు
బతుకు పొద్దులతో జీవితం ఒక
ఆస్వాధింపే దాన్ని అన్వయింపులేక
ఆరాటాలతో పొరబడ్డావా…
చితికిన దుస్థితిని చచ్చేవరకు బానిసగా మోయాల్సిందే…

ఆటలాడే ప్రాయం బాల్యపు
కవణాలతో అంకురమైనది మొదలు
పెరిగిన భావాలతో దేహమై…
ఒకరితోడుతో ఆదరణ పొందుతు…
పెంచుకొన్న ఆప్యాయతలతో భార్యభర్తల బంధమై…ఒకరిలో ఒకరై ఏడడుగులకు
అర్థమవుతు…పాలు పంచుకొన్న ప్రతిది
వారిలో అలసిపోని ప్రయాణాలే…

ఏ కోశాన తూలనాడని
ధర్మాలు తల్లి దండ్రుల స్థానం
అదే స్థానాన్ని పుణికి పుచ్చుకున్న
మెట్టినింటిది కూడా ఆ స్థానాన్ని
పెంపొందించుకొనే గౌరవమే కావాలి…
కుడి ఎడమలుగా ఎవరిది తీసిపోని
మర్యాదలే…ఆచరించే అనుసందానాన్ని
గమనంతో పంచుకుంటే సవరణలు
సరళీకృతాలై నడుస్తాయి…

కట్టుకున్నవాడు కాల కంఠకుడని
విరుద్ధానికి విషమై మార్చలేని తత్త్వం
బోధబడక ఓర్పునొదలేస్తు…
కానివాటం కల్పితమని తెలిసినా
తెగిన కొమ్మకు పూతబట్టదనే అలౌకిక
వాదనకు మచ్చబడుతు…
ఆశలతో పచ్చబడాలనే అందని పోకడలకు
రెక్కలు కడుతు ఎగిరిపోతున్నావు…
కారణాలెన్నైనా కావచ్చు….
ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తు…
నిజంగా బతకలేక పోవడానిదే తప్పు…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *